దేశంలో నిరుద్యోగం ఎక్కువై పోయిందని చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఉపాధి ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మోడీ సర్కార్ దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోతే గడ్డుకాలం తప్పదని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శలు చేశారు. దీంతో తనపై రాహుల్ చేసిన విమర్శలకు పార్లమెంటులో మోడీ కౌంటర్లు వేశారు. ఆరు నెలల్లో దేశంలో ఉన్న నిరుద్యోగుల సమస్య పరిష్కరించకపోతే మోడీని యువత కర్రలతో తరిమి తరిమి కొడతారని ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు గురించి స్పందిస్తూ పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చెప్పే సందర్భంలో బదులిచ్చారు.

 

కర్రల దాడిని తట్టుకునేలా తాను ప్రతిరోజు చేసే సూర్యనమస్కారాల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నానని మోడీ తెలిపారు. అంతేకాకుండా గత 20 ఏళ్లుగా తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొనటం జరిగిందని ఇప్పుడు తనని తాను దందా-ప్రూఫ్‌గా రాటుతేలానని చెప్పుకొచ్చారు. ఎన్డీఎ ప్రభుత్వం ప్రదర్శించిన అంకిత భావం, చొరవతో దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న రామజన్మభూమి, ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ వంటి సమస్యలు కొలిక్కివచ్చాయని చెప్పారు. 2014 నుంచి 2019 వరకూ తమ ప్రభుత్వ పనితీరును మెచ్చిన ప్రజలు తమకు తిరిగి అధికారం కట్టబెట్టారని అన్నారు.

 

తాము గతంలో పరిపాలించిన పాలకుల కాకుండా సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కరిస్తామని...గత ప్రభుత్వాల మాదిరిగా పరిపాలిస్తే ఆర్టికల్‌ 370 రద్దయ్యేది కాదని, ట్రిపుల్‌ తలాక్‌ సమస్య పరిష్కారమయ్యేది కాదని విపక్షాలకు మోదీ చురకలు వేసారు.  ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడిన మోడీ..యూపీఏ హయాంలో దేశంలో రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో ఎటువంటి వాతావరణం వాళ్లు క్రియేట్ చేయటం జరిగిందో వంటి విషయాల గురించి విపక్ష పార్టీలకు కౌంటర్లు వేస్తూ పార్లమెంటులో ప్రసంగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: