జగన్మోహనరెడ్డి పదికాలాల పాటు ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి. వెంకటేశ్వర రావు(నాని) అన్నారు. గొల్లపూడి (విజయవాడ) వ్వవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్తలు* రాజధాని ప్రాంతంలోని రైతులు పాలిట ద్రోహి చంద్రబాబు నాయుడని విమర్శించారు. మాజీ మంత్రి  దేవినేని ఉమా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తనదైన శైలిలో  ధ్వజమెత్తారు.

వదినను చంపి దేవినేని ఉమా, మామకు వెన్నుపోటు పోడిచి చంద్రబాబు నాయుడు చరిత్ర హీనులుగా మిగిలిపోయారని అన్నారు. నూతన పాలకవర్గం రైతులకు సేవలు అందించాలని సూచించారు. రైతు క్షేమమే రాష్ట్ర క్షేమమని రైతులు సంక్షేమమే కోసం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమనీ అన్నారు. నాటి మహనేత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో రైతులు సుఖసంతోషాలతో ఉన్నారు. తిరిగి జననేత జగన్మోహనరెడ్డి పాలనలో మళ్ళీ రైతులు సంతోషంగా ఉన్నారు. మధ్యలో 10 సంవత్సరాలు కష్ట కాలంలో ఉన్న ప్రజలకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని అన్నారు. మార్కెట్ కమిటిలకు శాసనసభ్యులను గౌరవ అధ్యక్షులుగా నియమించడం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు


నిత్యం గొల్లపూడి రోడ్లు పై ధర్నాలు చేయడం మానుకొవాలని దేవినేని అవినాష్ సూచించారు. చరిత్ర లో జగన్మోహనరెడ్డి శాశ్వతంగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జోగి రమేష్ ,  కైలే అనిల్ కుమార్, లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి  చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో  మార్కెటింగ్ శాఖ అధికారులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను అభినందించారు. అతిదులను ఘనంగా సత్కరించారు*

మరింత సమాచారం తెలుసుకోండి: