చంద్రబాబు చేసిన తప్పులే జగన్ పాలిట అస్త్రాలుగా మారాయా.. చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేయకుండా ఉండటం వల్లే ఇప్పుడు జగన్ సులభంగా రాజధాని మార్చుతున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ నాయకులే మీడియా సమావేశాల్లో చెబుతున్నారు.

 

ఇటీవల ఓ వైసీపీ నాయకుడు మీడియా సమావేశంలో ఏమ్నారంటే.. " కరకట్ట రోడ్డు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలి.. ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పుకున్నాడు.. కనీసం కరకట్ట మీద రోడ్డు కూడా నిర్మించలేదు. రూ. 3 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు దాంట్లో రూ. లక్ష కోట్లను రోడ్ల డెవలప్‌మెంట్‌కు వెచ్చించి ఉంటే వైయస్‌ జగన్‌కు ఈ ఆలోచన ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.. అంటే చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేయకుండా తప్పు చేయబట్టే జగన్ రాజధాని మార్చారని అన్నట్టే కదా.

 

ఆయనే ఇంకా ఏమన్నారంటే.. “ ‘తుగ్లక్‌ అయినా రాజధానిని మార్పు ఒక ఉద్దేశంతో చేశాడు కానీ, చంద్రబాబు కేసుకు భయపడి తెలంగాణ నుంచి పరిగెత్తుకుంటూ అమరావతి వచ్చి ఇదే నడిబొడ్డు అని మభ్యపెట్టాడు. అమరావతి రాజధాని అని ఒక చర్చ కూడా లేకుండా అడ్డగోలు నిర్ణయం తీసుకున్నాడు. తన కుటుంబం, తన కమ్యూనిటీ ఉన్న చోట కోట లాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. దాన్ని రాష్ట్రం అంతా భరించాలని చెబుతున్నాడు.. అంటూ చంద్రబాబు చేసిన ఈ తప్పుల వల్లే మాకు రాజధాని మార్చుకునే అవకాశం వచ్చిందని చెప్పకనే చెప్పేశాడు.

 

 

" చంద్రబాబు వ్యవహార శైలి ఘోరంగా ఉండి.. ఆయన మాటలు నమ్మిమోసపోయామని బలంగా నమ్మినందువల్లే ఆ కోర్‌ క్యాపిటల్‌లోని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో చంద్రబాబును చీత్కరించారు. ఆయన కుమారుడిని అడ్రస్‌ లేకుండా ఓడించారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్లతో గెలిస్తే.. 2019లో 10 వేల ఓట్లకుపైగా మెజార్టీఇచ్చారు. బంగారు రాజధాని నిర్మిస్తున్నాననే నమ్మకం అన్ని వర్గాల ప్రజల్లో కల్పించి ఉంటే రాజధాని ప్రాంతంలో అలాంటి తీర్పు ఎందుకు వస్తుందో చంద్రబాబు చెప్పాలని వైసీపీ నాయకులు అంటున్నారంటే.. చంద్రబాబు చేసిన తప్పుల వల్లే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: