రాజధానిని అమరావతి ప్రాంతం నుంచి మార్చొద్దని ఆ ప్రాతం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. దాదాపు 50 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నారు. రాజధానిని తరలిస్తే తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు. వీరి ఆందోళనలకు విపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఇక ఎల్లో మీడియా అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి లైవ్ లపై లైవ్ లు ఇస్తూ కుమ్మేస్తున్నాయి.

 

అయితే ఈ సమయంలో అమరావతి రైతుల గురించి ఓ వైసీపీ నేత షాకింగ్ కామెంట్ చేశాడు.

ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి భుూములు ఇచ్చిన రైతుల లెక్క దాదాపు 29 వేల మంది. అయితే.. అమరావతిలోని 28 వేల మంది 34 వేల ఎకరాల పొలాలు ఇస్తే.. వాళ్లలో 14 వేల మంది రైతులు కానివారు ఉన్నారట. అందువల్ల నిజమైన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదంటున్నారు వైసీపీ నేతలు.

 

కొందరు రియలెస్టేట్‌ కోసం భూములు కొనుగోలు చేసిన వారికి కొంత నష్టం జరిగి ఉండొచ్చు. చంద్రబాబు తన భూముల విలువ వందల రెట్లు పెంచుకోవడానికి అమరావతిని అద్బుతమైన నగరంగా పబ్లిసిటీ చేయించారు. కానీ చేసిందేమీ లేదు. భూముల విలువలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. తన భూముల ధరలు పడిపోతున్నాయనే చంద్రబాబు ఆరాటాన్ని ప్రజల బాధగా చూపిస్తున్నాడు.. అని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.

 

 

అంతే కాదు.. రాజధానిని ఎక్కడా మార్చలేదు. అత్యున్నతమైన శాసన వ్యవస్థ అమరావతిలోనే పెట్టారు. రాజధానిలో రెండు విభాగాలను వేరే ప్రాంతాలకు తరలించారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, భవిష్యత్తులో ఎప్పుడు అసంతృప్తి రాకుండా చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా మరో ఐదేళ్ల పాటు యాన్యువిటీ పెంచడం, రైతు కూలీలకు నెలకు ఇచ్చే సాయం రూ. 2500 నుంచి రూ.5 వేలకు పెంచడం చేశాం.. అంటూ తమ వాదనను సమర్థించుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: