అనంతపురంలోని కియా మోటార్స్ ఉత్పత్తి ప్లాంటు తమిళనాడుకు తరలిపోతోందంటూ ప్రచురించిన కథనం ఎంతటి సంచలనం రేకెత్తిచిందో అందరికీ తెలిసిందే. ఆ కథనాన్ని అంతర్జాతీయ మీడియా సంస్ధ రాయటర్స్  ప్రచురించింది. నిజానికి ప్రచురించిన కథనం మొత్తంలో ఎక్కడా వాస్తవం ఉన్నట్లు అనిపించదు. ఎందుకంటే వేలకోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఓ సంస్ధ తరపున బాధ్యుతలతో మాట్లాడినట్లు కథనంలో ఎక్కడా లేదు. పోనీ ప్రభుత్వంలోని ముఖ్యులతో మాట్లాడిందా అంటే అదీ లేదు.

 

ఏదో రచ్చబండ దగ్గర మాట్లాడుకునే మాటలన్నింటినీ గాలి పోగేసి కథనాన్ని రాసేసినట్లుంది.  ప్రభుత్వంపై బురద చల్లే విధంగా రాయటర్స్  ఎందుకింత చవకబారుగా కథనం రాసింది ? ఎందుకంటే తెరవెనుక నుండి ఎవరో రాయించినందు వల్లే కథనం రాసినట్లు అర్ధమైపోతోంది. జగన్మోహన్ రెడ్డిని గబ్బు పట్టించటమే ఏకైక ధ్యేయంగా  ప్రత్యర్ధులు 24 గంటలూ పనిచేస్తున్న విషయం తెలిసిందే.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాయటర్స్ లో కథనం రాగానే వెంటనే టిడిపి నేతలు రంగంలోకి దిగేసి జగన్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు పెట్టేయటం. అసలు రాయటర్స్ అనే వార్తా సంస్ధ ఉందని ఎంతమందికి తెలుసు ?  ఎంతమంది రాయటర్స్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతారు ? పైగా గురువారం కియా మోటార్స్ పై కథనం వచ్చినట్లు  టిడిపి నేతలకు  ఎలా తెలిసింది ?  అందులో కథనం రాగానే టిడిపి నేతలు స్పందించేశారంటే ఎక్కడో తేడా ఉన్నట్లు అనుమానం రావటం లేదా ?

 

జరుగుతున్నదంతా చూస్తుంటే ఓ పద్దతి ప్రకారం తెరవెనుక వ్యవహారాలతో జగన్ పై బురదచల్లే కార్యక్రమం జరుగుతోంది. తాము చెబితే ఎవరూ నమ్మటం లేదని, జాతి మీడియాను పట్టించుకోవటం లేదని అందరికీ అర్ధమైపోయింది. అందుకనే జాతీయ మీడియాను రంగంలోకి దింపారు. అయితే ఆ ప్రయత్నం కూడా వర్కవుట్ కాలేదు. దాంతో అంతర్జాతీయ మీడియాను రంగంలోకి కియా మోటార్స్ తరలిపోతోందంటూ బురద చల్లించే ప్రయత్నంచేశారు.  కాకాపోతే జగన్ స్పందించిన తీరుతో వాళ్ళ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: