పైకి గంభీరంగా రాజకీయ వ్యవహారాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చాలా ఆందోళన ఉంది. బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసిపి అధికారంలో ఉండడం,  గత ప్రభుత్వంలో తమ పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు, అవినీతి వ్యవహారాలు కారణంగా ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఏర్పడింది అనేది మెజార్టీ తెలుగు తమ్ముళ్లు భావన. అయితే పైకి మాత్రం ఇవేవీ కనిపించకుండా బలమైన పార్టీగా తెలుగుదేశం ఉందని, ఇప్పటికీ... ఎప్పటికీ తమ పార్టీకి ఆదరణ తగ్గదని, చంద్రబాబు సారధ్యంలో మరింత ముందుకు వెళ్తామని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో టిడిపి అగ్రనేతలతో సైతం వెన్నులో వణుకు పుడుతోంది. 


చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో రాజకీయాలు చేయగలిగిన సమర్థులైన నాయకులు లేకపోవడం, వారసత్వం కింద చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కు బాధ్యతలు అప్పజెప్పినా ఆయన పార్టీని నిట్ట నిలువునా ముంచడం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా ఇవే అంశాలపై ప్రభుత్వ చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ నిట్ట నిలువునా చీలిపోతుందనే ఆందోళనలతో ఏం మాట్లాడుతున్నారో చంద్రబాబు కు అర్థం కావడం లేదు అన్నారు. 


ఇక చంద్రబాబు భజన మీడియా ఇప్పటి వరకు ఆయనను  మోసి మోసి అలిసిపోయిందని, ఇక మోసేందుకు సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. చంద్రబాబు లో ఈ మధ్యకాలంలో భయాందోళనలు ఎక్కువవడంతో పిచ్చిపిచ్చిగా, ఇష్టం వచ్చినట్లుగా తమ నాయకుడు ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారని అన్నారు. జగన్ పై విమర్శలు చేసే స్థాయి చంద్రబాబుకు లేదని ఆయన విమర్శించారు. మీరు పోలీసుల మీదే ఆధారపడి జీవిస్తున్నారని, జడ్ ప్లస్ భద్రత లేకుండా జనాల్లోకి వెళ్లగలరా అంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాయలసీమలో రౌడీలు ఉన్నారని విమర్శలు చేసిన చంద్రబాబు ఇపుడు కియా మోటార్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటూ అసత్య కథనాలు చెబుతూ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


 బాబు చెప్పినట్లుగా ఆయన భజన పత్రికలు, ఛానెల్స్ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అమరావతికి చంద్రబాబు ఇప్పటి వరకు చేసిందేమీ లేదని, చంద్రబాబు బతుకంతా గ్రాఫిక్ బతుకు అంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అబద్దాలు మాట్లాడుతూ సీఎం జగన్ పై బురద జల్లుతున్నారని, దమ్ముంటే చంద్రబాబు తనతో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబును చూసి తాను సిగ్గుపడుతున్నానని, ఆయనకు దమ్ముంటే రైతులను ఎవరు మోసం చేస్తున్నారు అనే విషయంపై తూళ్లూరులోనే తమతో చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు 

మరింత సమాచారం తెలుసుకోండి: