పాపం చంద్రబాబునాయుడుకు నిద్రపట్టని వార్తే అనటంలో  సందేహం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు (ఏఐఐబి) ఏపికి రూ. 21 వేల కోట్లు అప్పు ఇవ్వటానికి నిర్ణయించుకుందట. గతంలో చంద్రబాబు హయాంలో ఏ బ్యాంకు కూడా ఇంత భారీ మొత్తాన్ని అప్పుగా ఇవ్వటానికి ముందుకు రాలేదన్నది వాస్తవం. మరి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఇంత భారీ మొత్తాన్ని అప్పుడు ఏఐఐబి బ్యాంకు ఇస్తోందంటే చంద్రబాబు, టిడిపి నేతలతో పాటు ఎల్లోమీడియాకు ఎలా సహిస్తుంది ?

 

చంద్రబాబు ప్రతిపక్షంలోకి మారగానే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని ఓ విషయంలో ఎగతాళి చేసేవారు. అదేమిటంటే  జగన్ ను చూసి అప్పులు ఇవ్వాలని అనుకుంటున్న బ్యాంకులు కూడా వెనక్కు వెళ్ళిపోతున్నాయని. ప్రపంచ బ్యాంకు కూడా అప్పు ఇచ్చే విషయంలో వెనక్కు తగ్గటానికి జగన్ చేతకాని తనమే కారణమంటూ అబద్ధాలను పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టింది. నిజానికి అధికారంలో ఉన్నంత కాలం ఖజనాను సాంతం నాకేసిన చంద్రబాబే సిగ్గుపడాలి.

 

ప్రభుత్వం అప్పులో ముణిగిపోవటానికి, బ్యాంకులు కానీ ఆర్ధిక సంస్ధలు కానీ రాష్ట్రానికి అప్పులు ఇవ్వటానికి వెనకాడుతున్నాయంటే అందుకు కారణం తానే అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. తప్పులన్నీ తనవైపు పెట్టుకుని జగన్ పై బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు.

 

నిజానికి సంక్షేమపథకాలు, అభివృద్ధి  కార్యక్రమాల అమలుకు ఖజానాలో డబ్బులు లేక జగన్ నానా అవస్తలు పడుతున్నది వాస్తవమే. ఇటువంటి నేపధ్యంలోనే ఏఐఐబి ఆపద్బాంధవుడి లాగ ఆదుకుంది. ఏకంగా రూ. 21 వేల కోట్లు అప్పు ఇవ్వటానికి అంగీకరించింది. పైగా తీసుకునే అప్పును ప్రభుత్వం తన ప్రయారిటి ప్రకారం దేనికైనా ఖర్చు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఇంకేముంది ? చంద్రబాబు, టిడిపి నేతలతో పాటు ఎల్లోమీడియాకు నిద్ర కరువైందని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: