ఈ మధ్యకాలంలో నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. ఇక దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది కేటుగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు నమ్మబలికి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత ప్లేటు ఫిరాయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో రోజుకు ఒకటి తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి తెరమీదికి వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాల పేరుతో... నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన అవినాష్ రెడ్డి బీటెక్ చదివి ఉద్యోగం కోసం 2015 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాడు. రెండు మూడు కంపెనీలో పని చేసినప్పటికీ ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో  ఉద్యోగాలను వదిలేసాడు. ఈ క్రమంలోనే విలాసాలకు అలవాటు పడ్డ యువకుడు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. 

 

 

 అప్పటికే భారీగా అప్పులు  చేసిన అవినాష్ రెడ్డి కి  ఆ తర్వాత... అప్పులిచ్చిన వాళ్ళు నుంచి డబ్బులు చెల్లించాలి అంటూ ఒత్తిడి రావడంతో నేరాలకు అలవాటు పడ్డాడు. నిరుద్యోగుల వీక్నెస్ ను  ఆసరాగా చేసుకున్నాడు... ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రకటనలు చేసి నిరుద్యోగులను ఆకర్షించాడు. సోషల్ మీడియా ద్వారా 26 మంది యువకులను  నమ్మించి... ఏకంగా వారి వద్ద నుంచి 21 లక్షల వరకు దోచుకున్నాడు ఈ కేటుగాడు. ఇటీవల కొంత మంది యువకులకు ఐబిఎం  సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మరోసారి భారీగా డబ్బులు తీసుకున్నాడు. అయితే ఎన్ని రోజులు అయినప్పటికీ ఉద్యోగాలు ఇప్పించకపోవడం... డబ్బులు తీసుకున్న వ్యక్తి దగ్గర నుంచి సరైన స్పందన లేకపోవడంతో... మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు.. సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు జరిగిన విషయాన్నంతా వెల్లడించారు. 

 

 

 ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు... గతేడాది నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక బెయిల్పై బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి మళ్లీ అదే తీరున కొనసాగిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తూ అలాంటి నేరాలకు పాల్పడుతుండంతో.. మరోసారి బాచుపల్లి పోలీసులు బుధవారం అవినాష్ ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. అయితే అవినాష్ రెడ్డి చేతిలో మోసపోయిన నిరుద్యోగులు పోలీసులకు సమాచారం అందిస్తే తాము న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే కడప జిల్లాకు చెందిన అవినాష్  రెడ్డి ని అందరూ జగన్ తమ్ముడు అంటూ ఉంటారు. అంత మంచి పేరు తెచ్చుకున్న అవినాష్ రెడ్డి మాత్రం కేటుగాడు గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: