బోడో శాంతి ఒప్పందంతో అసోంకు కొత్త వెలుగు వచ్చిందన్నారు ప్రధాని మోడీ. బోడో టెరిటోరియల్ కౌన్సిల్ కు మరిన్ని అధికారాలిస్తామని చెప్పారు. బాంబుల మోతతో దద్దరిల్లే కోక్రాఝర్ లో ఇంత బ్రహ్మాండమైన సభ జరగడమే.. అసోంలో మార్పుకు నాంది అని చెప్పారు మోడీ. 

 

అసోం బోడోల‌తో శాంతి ఒప్పందం కుదిరిన తరుణంలో.. బాంబుల మోతతో దద్దరిల్లే కోక్రాఝర్ లో ప్రధాని మోడీ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. బోడో ల్యాండ్ ఉద్యమంలో పాల్గొని.. ప్రజా జీవితంలో వస్తున్న అందరికీ ప్రధాని స్వాగతం పలికారు. అసోంకు కొత్త ఉదయం వచ్చిందన్న మోడీ.. బోడోల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. తాము బాధ్యత తీసుకునే వ్యక్తులమే కానీ.. బాధ్యతల నుంచి పారిపోయే వ్యక్తులంకామని వ్యాఖ్యానించారు మోడీ.  21వ శతాబ్దంలో ఈశాన్య భారతానికి అసోం వెలుగురేఖగా నిలవాలని మోడీ ఆకాంక్షించారు. 

 

కొందరు నేతలు తనను కర్రలతో కొట్టాలంటున్నారని.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు మోడీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్దసంఖ్యలో జనం హాజరైన రాజకీయ సభ కోక్రాఝర్ సభేనన్న మోడీ.. ఇంతమంది తల్లుల ఆశీర్వాదాలు ఉండగా.. ఏ కర్రలు తనను ఏమీ చేయలేవన్నారు. 

 

గ‌త పాల‌కులు ఈశాన్య భారతాన్ని విస్మరించారని, రోజుల తరబడి బ్లాకవుట్లు జరిగినా.. స్పందించలేదన్నారు. తాము  మాత్రం దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు మోడీ. తమ ప్రత్యర్థులకు ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడం అలవాటని, తాము మాత్రం దేశం కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు ప్రధాని. మొత్తానికి అసోంలో ప్రధాని మోడీ పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. తన ప్రసంగంతో అక్కడి నేతలను ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈశాన్య భారతానికి అసోం ఆశాజ్యోతిగా నిలవాలని ఆకాంక్షించారు. గత పాలకుల లోపాలను ఎత్తిచూపారు. తమ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: