ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులకు ప్రభుత్వం మెట్రో కోసం కొత్త డీపీఆర్ ను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రతిపాదనల కోసం ఈరోజు ఊత్తర్వులను జారీ చేసింది. అమరావతి మెట్రో రైల్ ఎండీని ఈ ప్రాజెక్టు కొరకు కొటేషన్లను పిలవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గతంలో ఎస్సెల్ ఇన్ ఫ్రా కన్సార్టియంకు డీపీఆర్ రూపకల్పనను అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. 
 
తాజాగా కొత్త డీపీఆర్ కొరకు ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వం 79.9 కిలోమీటర్ల పరిధిలో విశాఖలో మెట్రో రైలు నిర్మాణం కొరకు కార్యాచరణను రూపొందించింది.ప్రభుత్వం ప్రతిపాదనల రూపకల్పన కొరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, యూఎంటీసీ, రైట్స్ తదితర సంస్థలను సంప్రదించాలని ఉత్వరుల్లో పేర్కొంది. ప్రభుత్వం 60 కిలోమీటర్ల మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్ ఏర్పాటు కోసం మరో డీపీఆర్ సిద్ధం చేయటానికి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించింది. 
 
మూడు కారిడార్లలో మెట్రో నిర్మాణం జరగనుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయబోతున్న ప్రభుత్వం విశాఖను మరింతగా అభివృద్ధి చేసేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో మెట్రో, మోడ్రన్ ట్రామ్ కారిడార్ ను ఏర్పాటు చేయడం వలన విశాఖ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని భావిస్తున్నందువలనే విశాఖ విషయంలో ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటోంది. 
 
మెట్రో ప్రాజెక్టు దిశగా ప్రభుత్వం వేగంగా ముందడులు వేస్తూ ఉండటం పట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి దిశగా జగన్ అడుగులేస్తున్నారని ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తూ ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ఉండటం ఆనందంగా ఉందని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: