ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చంద్రబాబు గుర్తించడం వెనుక అవినీతి దాగివుందని ఎప్పటి నుండో ప్రతిపక్షంలో ఉన్న సమయం నుండే వైసిపి పార్టీ ఆరోపిస్తోంది. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసిపి తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు హయాంలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ ఈ విషయంపై దృష్టి సారించింది. మూడు రాజధానులు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఒకచోట జరగకూడదని వికేంద్రీకరణ జరగాలని సీఎం జగన్ ఇటీవల అసెంబ్లీలో పేర్కొనటం జరిగింది. కేవలం అమరావతిలో అభివృద్ధి జరిగితే మిగతా ప్రాంతాల ప్రజలు నష్టపోతారని...గతంలోనూ హైదరాబాద్ నగరంలో అందరూ అభివృద్ధి చేసి మన రాష్ట్రాన్ని మనమే మోసం చేసుకున్నామని...విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లో జరగడం వల్లే అని అలాంటి తప్పు మరొకసారి మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదని జగన్ తెలపడం జరిగింది.

 

13 జిల్లాల గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొకసారి ముక్కలు కాకూడదంటే ప్రజల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరగాలని దానికి మూడు రాజధానులు అవసరమని అసెంబ్లీలో జగన్ ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో జరిగిన భూ దోపిడీ గురించి మాట్లాడటం జరిగింది. ఎల్ఈడి స్క్రీన్ పై అసెంబ్లీలో చంద్రబాబు హయాంలో ఎవరు ఎన్ని ఎకరాలు కొన్నారు అన్ని విషయాలను ఇటీవల తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రాజధాని భూముల కుంభకోణంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం ఈ కేసును సిఐడికి అప్పగించింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సిఐడి కొత్తగా ఏడుగురిపై కేసు నమోదు చేసింది.

 

తెల్లరేషన్ కార్డు దారుల పేర్లతో కోట్లాది రూపాయల విలువైలన భూములు కొనుగోలు చేసినట్టు కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది. పాన్‌కార్డు లేని పేదలు కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించారని సిఐడి గుర్తించింంది. నాగమణి, నరసింహారావు, అనురాధ, కొండలరావు, భుక్యానాగమణి, అబ్దుల్, జమేదార్‌లపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై కేసు నమోదైన సంగతి తెలిసింది. దీంతో కొత్తగా ఈ ఏడుగురు పేర్లు తెరపైకి రావడంతో ఈ విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: