తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద శత్రువు అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి జరిగే ప్రతీ కార్యక్రమానికి చంద్రబాబు అడ్డు పడుతున్నారని రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే విషయాలలో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తన మీడియా చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక లకు ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏడు లక్షల పెన్షన్లు తొలగించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కానీ వాస్తవానికి ఆరు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చినట్లు బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు.

 

కియా ప్యాక్టరీ తరలిపోతోందంటూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేటు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడుగా చంద్రబాబు మారారని అన్నారు. అదికారం పోవడంతో అసహనంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని బొత్స ద్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాజధాని తరలించాలని కోరుకుంటున్నారని కొత్త సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఏ కార్యాలయం ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వం ఇష్టం. గత ప్రభుత్వం నోటి మాట తో ముందుకు వెళ్ళిందిని ఆయన అన్నారు. విజిలెన్స్ కార్యాలయం విజయవాడలో ఉండాలని చట్టం లో ఉందా?.. పరిపాలన సౌలభ్యం కోసమే విజిలెన్స్ కార్యాలయం తరలిస్తున్నామని’ బొత్స తెలిపారు.

 

రాష్ట్రంలో వికేంద్రీకరణ స్టార్ట్ అయిందని క్లారిటీ ఇచ్చారు. బలవంతపు భూసేకరణ చేసిన భూములు వెనక్కి ఇవ్వమని రైతుల కోరుతున్నారని రోడ్లు కింద పోయిన భూములు వేరేచోట ఇవ్వమని రైతులు కోరుతున్నారని తెలిపారు. వీటికి సంబంధించి అన్ని విషయాలను రైతులకు మేలు చేకూరే విధంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ మంత్రి బొత్స తెలిపారు. ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడిన బొత్స సత్యనారాయణ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: