తెలుగుదేశంపార్టీ నేతలపై అన్నీ వైపుల నుండి ఉచ్చు బిగుసుకుంటోందా ? క్షేత్రస్ధాయిలో  జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఒకవైపు సిఐడి, ఈడి విచారణ జరుగుతోంది. మరోవైపు ఐటి దాడులు జరుగుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబునాయుడుపై  ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ 14వ తేదీకి వాయిదా పడింది.

 

ఇలా అన్నీ వైపుల నుండి ఒకేసారి సమస్యలు కమ్ముకుంటుండటంతో  ఇటు చంద్రబాబుతో పాటు అటు నేతల్లో ఒకేసారి టెన్షన్ పెరిగిపోతోంది. దాంతో అరెస్టు భయం ఉన్న మాజీ మంత్రులు, నేతలు అజ్ఞాతంలోకి వెళిపోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. విచిత్రమేమిటంటే పై దర్యాప్తు సంస్ధలన్నీ రెండు రోజుల తేడాలో  దూకుడు పెంచటం.

 

కేసులు, దాడులు, విచారణ మొత్తం మీద చూస్తే పిఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ పై ఐటి దాడులు చేయటమే చాలా కీలకమనే చెప్పాలి. శ్రీనివాస్ అంటే మామూలు విషయం కాదు. పార్టీలోను, ప్రభుత్వంలోను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చంద్రబాబుకు కళ్ళు, చెవుల్లాగ పనిచేసిన వ్యక్తి. చంద్రబాబు తరపున ఐదేళ్ళు చాలా వ్యవహరాలను చక్కబెట్టిన వ్యక్తి. కాబట్టే మాజీ పిఎస్ పై పక్కా సమాచారంతోనే ఐటి అధికారులు దాడులు చేశారు. శ్రీనివాస్ ను గనుక విచారణ నిమ్మితం అదుపులోకి తీసుకుంటే సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.

 

ఇక ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరపణలపై విచారణ జరిపిన సిఐడి తర్వాత ఆ వివరాలను ఈడికి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. ఇన్ సైడర్ లోగుట్టును బయటపెట్టేందుకు ఈడి కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. ఇదే కేసులో సిఐడి ఏడుమంది బినామీలపై కేసులు నమోదు చేసింది. వీళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తే కొంత వరకూ సమాచారం బయటకు వస్తుంది.

 

ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న రాజేష్,  నరేష్ పైన కూడా ఐటి దాడులు సంచలనంగా మారింది. అంటే వీళ్ళల్లో ఎవరిని అదుపులోకి తీసుకున్నా పార్టీలోని ముఖ్యులకు సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఒక విధంటా టిడిపికి ఉచ్చు బిగుస్తున్నట్లే అనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: