కొంత మంది సినిమాలు చూసి చూసి అలానే బ‌య‌ట కూడా మోసాలు చేయాల‌నుకుంటారు. కొన్ని సినిమాల్లో కంపెనీ య‌జ‌మానుల్ని ప్రేమ‌లోప‌డేసి ఆ కంపెనీకే ఓన‌ర్లు అయిపోయే సినిమాలు మ‌నం ఎన్నో చూసి ఉంటాం. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో చోటుచేసుకుంది. క‌ర్నూల్‌కి చెందిన ఓ వ్య‌క్తి హైద‌రాబాద్ ఆన్‌లైన్ కంపెనీలో ప‌ని చేస్తున్నాడు. అందులో సీఈఓగా ఓ అంద‌మైన అమ్మాయి వ‌చ్చింది. అంతే దెబ్బ‌కి మ‌న‌వాడు ఎలాగైనా త‌న‌ను ప్ర‌మ‌లో ప‌డేసి కంపెనీకి ఓన‌ర్ అయిపోవాల‌నుకున్నాడు. కానీ ఇది సినిమా కాదు క‌దా ప‌డిపోవ‌డానికి  దెబ్బ‌కి సీన్ రివ‌ర్స్ అయిపోయింది. 

 

క‌ర్నూల్ జిల్లాకు చెందిన ల‌క్ష్మీకాంత్ అనే యువ‌కుడు ఆ కంపెనీ సీఈవోను ప్రేమ‌లో ప‌డేయాల‌ని చూశాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించ‌సాగాడు. ఇక ఇదిలా ఉంటే...ల‌క్ష్మీకాంత్‌కి ఆల్రెడీ వివాహ‌మ‌యి ఒక పాప కూడా ఉంది. అయినా కూడా ఆ సీఈఓని ప‌డేయాల‌ని ప్లాన్ చేశాడు.  కానీ ఆమె దాన్ని నిరాకిరించింది. అయినా చెప్పిన మాట విన‌కుండా ఆమెను వేధించ‌డంతో  అత‌నిని ఉద్యోగం నుంచి తొలగించారు.

 

దీంతో అత‌డు మ‌రింత రెచ్చిపోయి ఆమె ప‌ర్స‌న‌ల్ మెయిల్ ఐడీ వేరే ఐడీతో ప్రేమ లేఖ‌లు పంప‌డం మొద‌లుపెట్టాడు. ఆమె తిరస్కరిస్తూ వస్తుండటంతో అతడు వేధింపుల పర్వం మొదలుపెట్టాడు. లొంగకపోవడంతో అసభ్యంగా ప్రవర్తించాడు. సీఈవోకు అసభ్యకరంగా సందేశాలు పంపించడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా అశ్లీల చిత్రాలను కూడా పంపిస్తూ వేధించాడు.

 

దీంతో ఆమెకు తిక్క‌రేగి వెంట‌నే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్ర‌స్ ద్వారా ల‌క్ష్మీకాంత్‌ని క‌నుకొని పోలీస‌లు అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. దీంతో ముఖ్యంగా మ‌హిళ‌లు తెలుసుకోవ‌ల‌సిందేమిటంటే... ఎలాగైనా స‌రే ఆడ‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అంటున్నారు పోలీసులు. మ‌హిళ‌లు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్ల‌మ్ వ‌చ్చినా కూడా పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని అందుకు ఎటువంటి ఆలోచ‌నా ఉండ‌కూడ‌ద‌న్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: