తెలుగు మీడియా పార్టీల వారీగా చీలిపోయిందన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ముందు వరకూ ఈ మీడియా వార్ చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అదే టెంపో కొనసాగుతోంది. తెలుగులో ఆగ్రశ్రేణి దిన పత్రికలు రెండు చంద్రబాబుకు డబ్బా పత్రికలుగా మారిపోయాయన్న సంగతి తెలిసిందే. ఆ రెండు పత్రికలకు సొంత ఛానళ్లు కూడా ఉన్నాయి.

 

ఈ రెండూ చంద్రబాబుకు డబ్బా కొడుతుంటే.. ఇక అధికార పార్టీ వైసీపీకి సొంత మీడియా సాక్షి ఉండనే ఉంది. దీనికీ సొంత ఛానల్ ఉంది. ప్రస్తుతం ఈ మూడు ఛానళ్ల పరిస్థితి ఎలా తయారైందంటే.. మేం ఒక వైపే చూస్తాం అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. జగన్ ఏం చేసినా తప్పే అనే తరహాలో ఆ రెండు పత్రికలు, ఛానళ్లు వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు ప్రెస్ మీట్లు కానీ.. టీడీపీ నాయకుల ప్రెస్ మీట్లు గానీ.. గంటల తరబడి లైవ్ లు ఇస్తూ తరించిపోతుంటాయి ఈ ఎల్లో ఛానళ్లు.

 

ఇక సాక్షి టీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది అధికార పార్టీ స్వరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ప్రతిపక్షం వాయిస్ కు చోటే కనిపించదు. ఇప్పుడు అమరావతి ఆందోళనలు, మూడు రాజధానులకు మద్దతు వార్తల కవరేజీలోనూ ఈ మూడు ఛానళ్లదీ ఇదే ధోరణి. అమరావతి కోసం జరుగుతున్న రైతుల ధర్నాలను ఎల్లో ఛానళ్లు రోజంతా కవర్ చేస్తూనే ఉంటాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల సంగతి మాకు అనవసరం అన్నట్టు ఈ ఛానళ్లు వ్యవహరిస్తున్నాయి.

 

ఇక సాక్షి టీవీ.. మూడు రాజధానులకు మద్దతుగా జరుగుతున్న ప్రదర్శనలను హైలెట్ చేస్తుంటుంది. ఇక వీటిని చూసే ప్రేక్షకులు కూడా ఈ విషయంలో క్లారిటీకి వచ్చేశారు. కొసమెరుపు ఏంటంటే.. సాక్షి తాము జగన్ మీడియా అని స్వయంగా చెప్పుకుంటుంటే.. పాపం ఎల్లో ఛానళ్లు మాత్రం.. అలా తాము చంద్రబాబు మీడియా అని చెప్పుకునే సాహసం చేసే పరిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: