నిజంగా ఇది సంచలనం కలిగించే వార్తే అనటంలో సందేహం లేదు. ఎందుకంటే టిడిపి అధికార ప్రతినిధి వర్ల రామయ్య బిజెపి ఎంపి జీవిఎల్ నరసింహారావును నోటికొచ్చినట్లు తిడితే కమలంపార్టీలోని ఒక్కరంటే ఒక్క నేత కూడా  నోరిప్పలేదు. దాంతో జీవిఎల్-పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు అర్ధమైపోయింది. మొదటి నుండి బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు వ్యవహార శైలి మిగిలిన నేతల్లో  ఎవరికీ పడటం లేదు. ఎందుకంటే సొంత ఆలోచనలతో మాట్లాడుతున్న జీవిఎల్ అంటే మిగిలిన నేతలకు బాగా మంటగా ఉంటోంది. కాకపోతే పై స్ధాయిలో బాగా పట్టుంది కాబట్టి బయటకు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. 

 

మూడు రాజధానుల వ్యవహారం కానీండి లేకపోతే శాసనమండలి రద్దు విషయం కూడా తీసుకోండి. చాలామంది నేతలు ఒక లైన్ లో మాట్లాడుతుంటే జీవిఎల్ మాత్రం వాళ్ళకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడే  అందరితో తేడా కొట్టేసింది ఈ ఎంపికి.  మూడు రాజధానుల ఏర్పాటును జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినప్పటి నుండి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి లాంటి నేతలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అందరూ చూస్తున్నదే.

 

మూడు రాజధానులని అన్నారే కానీ వాస్తవంగా సచివాలయం ఎక్కడుంటుందో  అదే రాజధాని అయిపోతోంది. అయితే చాలామంది నేతలు మాత్రం రాజధానిని అమరావతి నుండి తరలిస్తే ఊరుకునేది లేదంటూ భీషణ ప్రతిజ్ఞతలు చేస్తున్నారు. నిజానికి రాజధాని తరలింపు వ్యవహారంలో వీళ్ళెవరికీ సంబంధం లేదు, కేంద్రం జోక్యం అవసరం లేదు.  ఇదే విషయాన్ని జీవిఎల్ మొదటి నుండి చెబుతున్నారు. రాజధాని ఎక్కడుండాలనే విషయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిదే అని చెబుతున్నారు.

 

ఇక శాసనమండలి వ్యవహారం కూడా ఇలాగే ఉంది. అందరు నేతలు ఒకలా మాట్లాడుతుంటే జీవిఎల్ మాత్రం విరుద్ధంగా మాట్లాడుతున్నారు.  విరుద్ధమంటే వాస్తవాలు మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళేమో జగన్ ను బ్లాక్ మెయిల్ చేసే పద్దతిలో బెదిరిస్తున్న కారణంగా   జీవిఎల్  మాటలు వాళ్ళకు రుచించటం లేదు. చివరకు పై రెండు అంశాల్లోను జీవిఎల్ వాదననే కేంద్రప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. దాంతో మిగిలిన నేతల సంగతెలాగున్నా కమలం పార్టీలోని నేతలకే జీవిఎల్ శతృవైపోయారు. అందుకనే వర్ల ఈ ఎంపిని ఎంతగా తిట్టినా ఎవరు నోరు కూడా విప్పలేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: