ఒక‌ప్పుడు మ‌హాన‌గ‌రమైన ముంబై భార‌త‌దేశంలోనే ఆర్ధిక రాజ‌ధానిగా పేరుగాంచింది. దేశంలోనే అతిపెద్ద మున్సిపాలిటీ  అని చెప్ప‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితులు తారుమారు అయ్యాయి. ఆర్ధిక ప‌రిస్థితులు స‌రిగాలేక భూముల రేట్లు మొత్తం ప‌డిపోయాయి. దాంతో తీవ్ర ఆర్ధికంగా ఇబ్బంది నెల‌కొనింది. దీంతో డ‌బ్బులు రాక‌. డ‌బ్బుల ఆదాయం ఎలా పెంచాల‌నే ఆలోచ‌న‌తో దేని మీద అధిక ప‌న్ను విధిస్తే డ‌బ్బులు వ‌స్తాయ‌నే యోచ‌న చేస్తుంది. దీంతో తాజాగా  చెత్తమీద  ట్యాక్స్‌‌ వేద్దామని ఫిక్సయింది. అలాగే బర్త్‌‌ సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడూ  ఎక్స్‌‌ట్రా లెవీ వేద్దామనుకుంటోంది. కొత్త ట్యాక్స్‌‌లు వేయడమే కాక ఇప్ప‌టివ‌ర‌కు బాకీ ప‌డ్డ‌వారితో వసూలు చేసే పనిలో పడింది. ప్రాపర్టీ ట్యాక్స్‌‌, వాటర్‌‌ ట్యాక్స్‌‌ డిఫాల్టర్లకు నోటీసులిచ్చి పైసలు రాబట్టే ప‌నిలో ప‌డింది. ఒక‌వేళ టాక్స్ క‌ట్ట‌ని ప‌క్షంలో ఏకంగా ఆ  ప్రాపర్టీని వేలం వేయాలని, నీటి కనెక్షన్‌‌ కట్‌‌ చేయాలని గ‌ట్టి నిర్ణ‌యానికి వ‌చ్చింది. 

 


ఇక గ‌త ఏడాది ముంబై కార్పొరేష‌న్ ఆదాయం ఒకేసారి ఐదుశాతం వ‌ర‌కు త‌గ్గింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌వ‌డ‌మే అని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. పెట్టుబ‌డి పెట్టిన‌ప్పుడు సుమారు 78వేల కోట్లు వ‌చ్చే యేడు ఇన్‌‌కమ్‌‌ తక్కువ వ‌స్తుందని అంచనా వేస్తోంది.  సుమారు గ‌త ఏడాదికంటే 11శాతం వ‌ర‌కు తగ్గే అవ‌కాశమున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎకానమీ స్లో డౌన్‌‌ వల్ల రిజర్వు బ్యాంకు నుంచి కూడా ఎలాంటి కాంపెన్సేషన్‌‌ వచ్చే అవకాశం లేదని అనుకుంటోంది. 2017 వరకు ముంబై కార్పొరేషన్‌‌కు మూడో వంతు  ఆదాయం ఆక్ట్రాయ్‌‌ పన్ను నుంచే వచ్చేది. కానీ స‌డెన్‌గా దాన్ని  జీఎస్టీలో కలిపేశారు. దీంతో కాంపెన్సేషన్‌‌ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇక దీంతో దానీ మీదా ఆశలను కార్పొరేషన్‌‌ వదులుకుంది. అందుకే కొత్త కొత్త టాక్స్‌లు అలాగే పెండింగ్‌లో ఉన్న బ‌కాయిలు అన్నీ వ‌సూళ్ళు చేసే ప‌నిలో ప‌డ్డారు. 

 

9శాతం ఎక్కువ బ‌డ్జెట్‌ను ఖర్చు చేయాల‌నే నిర్ణ‌యం కోర్ప‌రేష‌న్ తీసుకుంటోంది. అలాగే వ‌ర‌దలు రాకుండా అక్క‌డ ఉన్న డ్రైనేజ్ వ్య‌వ‌స్థ కూడా బాగు చేయాల‌ని చూస్తున్నారు.  సిటీ తీరాన్ని తాకుతూ పోయే ‘క్వీన్స్‌‌ నెక్లెస్‌‌’ కోస్టల్‌‌ రోడ్‌‌కూ బాగానే ఖర్చు చేయాలనుకుంటోంది. ఇక ఆదాయాన్ని ప‌ట్టే దిశ‌గా ప‌నుల‌ను ముందుకు తీసుకువెళుతుంది. ఇక మ‌న భార‌త‌ దేశంలోని చాలా రాష్ట్రాల బడ్జెట్‌‌ కన్నా బీఎంసీ బడ్జెట్‌‌ ఎక్కువ. పోయిన్ ఏడాది జీహెఎంసీ బ‌డ్జెట్ కంటే ఈ ఏడాది అధికంగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: