గ్రేటర్ హైదరాబాద్ నగర్ శివారు శంషాబాద్ లో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీలు. పాఠశాల బస్సుల పై ఉదయం నుండి కొనసాగుతున్న దాడులు. నిబంధనలను పాతర వేస్తున్న స్కూల్ బస్సుల పై దృష్టి సారించిన రవాణా శాఖ అధికారులు. గతంలో స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగింది. ఆ సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులున్నట్లు సమాచారం. విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలో వారం రోజుల్లో స్కూల్ విద్యార్థులకు రెండో ప్రమాదం జరిగింది.

 

స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. 15 మంది విద్యార్థులతో వెళ్తున్న ఆటో రంగారెడ్డి జిల్లా జిల్లెడ్ వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా డిటిసి ప్రవీణ్ రావు ఆదేశాల మేరకు శంషాబాద్ లో స్కూల్ బస్సులపై దాడులు నిర్వహించిన అధికారులు. నిబంధనలు పాటించని 8 బస్సులను సీజ్ చేసిన అధికారులు. పలు బస్సుల పై కేసులు నమోదు.  

 

పరిమితికి మించి స్కూల్ బస్సులో పిల్లలను రవాణా చేయడం, డ్రైవర్లు యూనిఫాం వేసుకోక పోవడం, ఫిట్‌నెస్, పర్మిట్లు లేకుండా బస్సులు తిప్పడం లాంటి వాటిని సీజ్ చేసి సీజింగ్ యార్డ్ కు తరలింపు. నిరంతరం ఈ దాడులు కొనసాగుతాయని వెల్లడించిన అధికారులు. తప్పకుండా రవాణా శాఖ నిబంధనలు పాటించాలని స్కూల్ బస్సుల యాజమానులను హెచ్చరించిన రవాణా శాఖ అధికారులు. బ్రిలియంట్, ఒయాసిస్, శారదా, ఎస్ ఆర్ డిఐజిఐ, రవీంద్ర భారతి స్కూల్స్ కు చెందిన 8 బస్సులను సీజ్ చేసి పలు బస్సుల పై కేసులు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: