తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ‘దిశ’ అత్యాచారం హత్య ఘటన దేశాన్ని కలచివేసింది. ‘దిశ’ అత్యాచారంలో పాల్పడిన నలుగురు నిందితులు తెలంగాణ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్ అవ్వడం జరిగింది. యావత్ దేశాన్ని కదలించిన ఈ అత్యాచారం ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పట్లో అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఘటన ఏ ఆడపిల్లకి జరగకూడదని కోరుకున్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేస్తూ ‘దిశ’ యాక్ట్ అనే చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది. మహిళల రక్షణ కోసం ఈ చట్టం తీసుకువచ్చినట్లు జగన్ అప్పట్లో తెలిపారు.

 

ఇటువంటి నేపథ్యంలో ‘దిశ’ చట్టం యాక్టు లో భాగంగా తాజాగా రాష్ట్రంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ నీ రాజమహేంద్రవరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటుహోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ కూడా జగన్ ప్రారంభించనున్నారు.రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం ‘దిశ’ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

 

వీటి ద్వారా మహిళలకు సంబంధించి పూర్తిగా భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయబోతున్నట్లు ఏపీ హోం శాఖ మంత్రి తెలిపారు. అంతేకాకుండా ఈ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న మహిళ పోలీసులకు ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తున్నట్లు వివరించారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వీళ్లంతా 24 గంటలూ... మహిళల భద్రత కోసం పనిచేస్తారు.

 

దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసు నమోదైనా... అది 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి... సరైన సాక్ష్యాధారాలు ఉంటే... దోషులకు కేసు నమోదైనప్పటి నుంచీ 21 రోజుల్లో శిక్ష అమలు చేయనున్నట్లు హోంమంత్రి చెప్పుకొచ్చారు. మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తారు. సోషల్ మీడియా, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదు. ఇలాంటి చాలా ఆసక్తికర అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: