తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఎన్నో సరికొత్త ఐటీ కంపెనీలు వెలిసిన విషయం తెలిసిందే. ఇక ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ పదవి బాధ్యతలు చేపట్టాక... ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందింది. వివిధ దేశాల నుంచి హైదరాబాద్ నగరానికి ఐటీ పరిశ్రమలు వచ్చేలా కేసీఆర్ ఎంతో కృషి చేశారు. ఐటీ సంస్థల పెరగడంతో ఉపాధి కల్పన కూడా ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలోనే టాప్ ప్లేస్లో ఉంది అనడంలో సందేహం లేదు. అయితే తాజాగా మరోసారి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు తీపికబురు చెప్పారు. తాజాగా జేబీఎస్ నుండి ఎంజిబిఎస్ స్టేషన్ల మధ్య హైదరాబాద్ మెట్రో రైలు సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

 


 కాగా ఈ మెట్రో రైలు సేవలు కారణంగా నగర వాసులందరికీ ఎంతగానో ప్రయాణ భారం తగ్గుతుంది. అయితే జేబీఎస్ నుండి ఎంజిబిఎస్ స్టేషన్ల మధ్య హైదరాబాద్ మెట్రో రైలు సేవలను ప్రారంభించిన వేళ తెలంగాణ ప్రజానీకానికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీపి కబురు వినిపించారు. వరంగల్ జిల్లాలో మైండ్ ట్రీ  కేంద్రాన్ని ప్రారంభించడానికి ఎల్ అండ్ టి  సంస్థ అంగీకరించింది. వరంగల్ నగరంలో మైండ్ ట్రీ కేంద్రాన్ని ప్రారంభించాలనే  ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాకు ఎల్ అండ్ టి  సీఈవో అండ్ ఎండి ఎన్ఎస్ సుబ్రహ్మణ్యం గారు అంగీకరించారు అంటూ కేసీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా కేటీఆర్ ట్వీట్ పై ఎంతోమంది ప్రస్తుతం హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. 

 


 తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐటీ సంస్థలు అన్నీ కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితమయ్యాయి అంటూ తెలిపిన కేటిఆర్ తెలంగాణా లోని వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం నగరాలకు కూడా ఐటి సంస్థలు విస్తరించేలా చేసి అన్ని నగరాల ను హైదరాబాద్ వళ్లే అభివృద్ధి చేయడానికి తెలంగాణ భావిస్తుంది అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. హైదరాబాద్లో తూర్పున ఉన్న ఉప్పల్ ప్రాంతంలో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే హైదరాబాద్ వరంగల్ నగరాలు ముంబై-పూణే తరహాలో సాగుతాయి అంటూ తెలంగాణ సర్కార్ భావిస్తోందని కేసీఆర్ తెలిపారు. కాగా వరంగల్ నగరంలో మైండ్ ట్రీ ఏర్పాటుతో  ఎన్నో ఐటీ కంపెనీలు రావడంతో పాటు ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: