సాధారణంగా ప్రతివ్యక్తి తన జీవితంలో సుఖం సంతోషం ఆనందం అను నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ మూడు పదాల మధ్య సారుప్యత ఉన్నప్పటికీ మధ్యలో కొంత వ్యత్యాసం లోతుగా విశ్లేషించిన వారికి కనిపిస్తుంది. పంచేంద్రియాలకు ఉత్తేజం కలిగినప్పుడు మనలో కలోగే అనుభూతులను సుఖం అని అంటారు. మధురమైన పాటలు స్పూర్తిని ఇచ్చే మాటలు మనకు నోరూరించే వంటకాలు తిన్నప్పుడు మనకు శారీరకంగా సుఖం పొందుతున్నట్లు భావన కలుగుతుంది.


అదేవిధంగా సంతోషం గురించి విశ్లేషిస్తే మనలో మధుర భావాలు కలగడాన్ని సంతోషం అని అంటారు. జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు మనలో కలిగేది సంతోషం. అంతేకాదు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నప్పుడు ఊహించని లాభాలు పొందినప్పుడు విజయాలు కలిగినప్పుడు మనలో కలిగే భావోద్వేగమే సంతోషం. ఒక వ్యక్తికి సంతోషం కలిగినప్పుడు ఆ భావన ఆ వ్యక్తి ముఖ కవళికలలో అతడి మాటలలో ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది.


ఇక ఆనందం గురించి మాట్లాడుకుంటే ఈ ఆనందం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య కారణాలు రెండు అంతర్గత కారణాలు. అయితే ఒక వ్యక్తి పొందే ఆనందం ఆ వ్యక్తి మానసిక స్థితిని బట్టి అతడిని సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని అంటారు. ఈ శారీరిక మానసిక కారణాలు అన్నీ సమ పాళ్ళలో ఉన్న ఆ వ్యక్తి దగ్గర మాత్రమే ఆనందం నిలిచి ఐశ్వర్యాన్ని పొందుతాడు.  


అయితే ఆ ధనాన్ని తనకు నచ్చిన వారితో పంచుకున్నప్పుడు మాత్రమే ఆ ధనం మరింత పెరుగుతుందని స్వామీ వివేకానంద తన ఉపన్యాసాలలో అనేకసార్లు చెప్పారు. ప్రస్తుతం మనిషి తాను ఏమి చేసినా డబ్బు కోసమే చేస్తున్న పరిస్థితులలో ఆ విషయాలు వెనుక అంతిమ లక్ష్యంగా ఉన్న ఆనందాన్ని గుర్తించ గలిగినప్పుడు మాత్రమే అతడు ధనవంతుడు కాగలుగుతాడు. అందుకే ఆనందం ఎక్కడ ఉంటే అక్కడ విజయం తో పాటు ఐశ్వర్యం వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: