వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజే పరిపాలన విషయంలో మరియు అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలు చూడమని మాట ఇవ్వటం జరిగింది. ఇదే సందర్భంలో పరిపాలనలో ఎక్కడా కూడా అవినీతి కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ఎక్కడా జరగకుండా సుపరిపాలన అందిస్తానని ఆరోజు మాట ఇచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి...ఆ దిశగానే అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మరియు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని అడుగులు వేస్తున్నారు. ఆడవాళ్లకు మరియు స్కూల్లో చదువుతున్న పిల్లలకు కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించిన జగన్ అదే దిశగా పరిపాలనను కొనసాగిస్తున్నారు.

 

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసిపి పార్టీ కార్యకర్తలు మరో పార్టీకి చెందిన వాళ్ళు అనేది ఎక్కడా కూడా తారతమ్య భేదం లేకుండా సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ వర్తింపజేస్తూ దేశంలోనే ప్రజలు మెచ్చుకున్న మంచి ముఖ్యమంత్రిగా మూడవ స్థానం ఇటీవల దక్కించుకున్నారు జగన్. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి గుడ్ న్యూస్ చెప్పే విధంగా జగన్ సర్కార్ రెడీ అయింది. గతంలో చంద్రబాబు అనేక సార్లు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచిన గానే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం అని చాలాసార్లు ఆ ప్రాంతానికి చెందిన ప్రజల కామెంట్ చేసే వాళ్ళు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు కూడా తన నియోజకవర్గానికి సంబంధించి చెయ్యాలని ఆలోచన లేని దాన్ని జగన్ చేయడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

 

మేటర్ లోకి వెళ్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గ కేంద్రం కుప్పం ను ఎప్పుడూ మున్సిపాల్టీ చేయాలన్న ఆలోచన చేసినట్లు లేరు. కాని ముఖ్యమంత్రి జగన్ కుప్పం ను మున్సిపాల్టీ చేయడం విశేషం. ఒక వార్త ప్రకారం కుప్పంతో పాటు కృష్ణా జిల్లా కొండపల్లిని కూడా మున్సిపాల్టీ చేశారు.అలాగే మరో ఎనిమిది పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చారు. పట్టణ స్థానిక సంస్థలు 110 నుంచి 120కి పెరుగుతాయి. కుప్పం, కొండపల్లి పురపాలక సంఘాలతోపాటు, నగర పంచాయతీలుగా దర్శి (ప్రకాశం జిల్లా), బేతంచర్ల (కర్నూలు), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), ఆకివీడు, పెనుకొండ (పశ్చిమ గోదావరి), కమలాపురం (కడప), గురజాల, దాచేపల్లి (గుంటూరు) ఏర్పడ్డాయయని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: