తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. కేసీఆర్ రెండ‌వ‌ సోదరి భ‌ర్త ప‌ర్వ‌త‌నేని రాజేశ్‌వ‌ర్‌రావు (84) అనారోగ్యంతో శ‌నివారం ఉద‌యం క‌న్నుమూశారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్ల లో నివ‌శిస్తుస్తున్నారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు. రాజేశ్వర్ రావు మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. 

 


విష‌యం తెలియ‌గానే ఆయ‌న హుటా హుటిన అక్క‌డ‌ని బ‌యలు దేరి వెళ్ళారు. అల్వాల్ మంగాపురిలో రాజేశ్వర్ రావు పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. రాజేశ్వర్ రావు మృతి పై సమాచారం అందిన వెంటనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు.రాజేశ్వర్ రావు పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. మిగ‌తా పార్టీ నేత‌లంతా కూడా ఆయ‌న కుటుంబానికి సంతాపం తెలిపారు. శనివారం సాయంత్రం అల్వాల్ లోనే రాజేశ్వర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారని స‌మాచారం. 

 


2018 ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. మ‌ళ్ళీ స‌రిగ్గా రెండేళ్ళ‌కి ఇప్పుడు ఆమె భ‌ర్త చ‌నిపోయారు. ఆయ‌న నాలుగ‌వ సోద‌రి లీల‌మ్మ కూడా 2018లోనే అనారోగ్యంతో మృతి చెందారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. చంద్రశేఖర్ రావు కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ ఇతనికి రాజకీయ గురువు. 70 వ దశకంలో యువజన  కాంగ్రెస్  నాయకుడిగా ఉన్న కేసీఆర్, 1982లో తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: