రాజకీయాల్లో అవసరాల కోసం నేతలని వాడుకోవడంలో చంద్రబాబుని మించిన వారు ఎవరు లేరన్న సంగతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. ఆయన సమయం బట్టి వాడుకోవడం తర్వాత పక్కనబెట్టేయడం చేస్తారు. అలా పక్కకు వెళ్లిపోయే నేతలు భవిష్యత్ తర్వాత ఏం అవుతుందో ఎవరికి అర్ధం కాదు. అయితే ఈ విధంగానే బాబు ఓ ఇద్దరు నేతలని నిండా ముంచేసి వదిలేశారు. దీంతో వారు బాబుని వదిలేసి జగన్ పక్కకు వెళ్ళిన వారు భవిష్యత్ ఆగమ్యగోచరంగానే ఉంది.

 

అలా బాబు ముంచిన ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు. ఒకరు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్ రెడ్డి కాగా, మరొకరు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. అసలు వీరు ముందు నుంచి వైసీపీలోనే ఉంటే భవిష్యత్ చాలా బాగుండేది. కానీ అధికారం కోసం ఆశ పడి బాబు పక్కకు వెళ్ళి మునిగిపోయారు. 2014 ఎన్నికల్లో ఎస్‌వి కర్నూలు ఎమ్మెల్యేగా గెలిస్తే, బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా గెలిచారు. వైసీపీ నుంచి గెలిచిన వీరు తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ అయిపోయారు.

 

ఇక ఉన్నన్ని రోజులు అధికారం అనుభవించి, జగన్‌పై గట్టిగానే విమర్శలు చేశారు. కానీ 2019 ఎన్నికలకొచ్చేసరికి బాబు వీరికి చుక్కలు చూపిస్తూ, ఎన్నికల్లో టికెట్ లేకుండా చేశారు. ఇద్దరికీ మళ్ళీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఇద్దరు లాభం లేదని చెప్పి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అలా అని జగన్ వీరికి టికెట్ ఇవ్వకుండా పక్కనబెట్టేశారు. ఇక వీరు వైసీపీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేశారు.

 

తర్వాత వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది గానీ వీరికి ఎలాంటి పదవులు రాలేదు. ఏదో ఎస్‌వి కర్నూలు నియోజకవర్గంలో కాస్త ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారుగానీ, బుట్టా రేణుక అయితే అసలు అడ్రెస్ లేరు. ఏదేమైనా బాబుని నమ్మి వీరు భవిష్యత్‌నే నాశనం చేసుకున్నారనే చెప్పొచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో జగన్ వీరికే ఏమన్నా అవకాశం ఇస్తారేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: