కులాలు లేవు.. మతాలు లేవు... ప్రాంతాలు లేవు... పార్టీలు లేవు..అందరికీ సంక్షేమ పథకాలే అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చింది మొదలు, కేవలం 8 నెలల్లోనే మునుపెన్నడూ ఏ సీఎం అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించారు. అర్హులైన ప్రతిఒక్కరు లబ్ది పొందేలా చేశారు. 8 నెలల్లోనే ఊహించని స్థాయిలో పెన్షన్స్, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు సాయం, మత్యకారులు, చేనేత కార్మికులకు ఆర్ధిక సాయం, కాపు నేస్తం, అమ్మఒడి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ప్రజలకు అందించారు. అటు నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు.

 

అయితే ఇంత చేసిన ప్రతిపక్ష టీడీపీ జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూనే వచ్చింది. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ లబ్ది పొందాలనే చూసింది. ఇక ఇటీవల అభివృద్ధి కోసమని తీసుకొచ్చిన మూడు రాజధానులని వ్యతిరేకించి అమరావతినే రాజధానిగా ఉండాలని ప్రాంతాల మధ్య చిచ్చు లేపే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ ఎంత విష ప్రచారం చేసిన, జగన్ తను అనుకున్న మేరకే ముందుకే వెళుతున్నారు. కాకపోతే జగన్ ఎంత కష్టపడిన టీడీపీ విషప్రచారంలో పథకాలు వెనుకబడిపోయి, రాజధాని విషయమే ప్రజల్లో ఎక్కువ వెళ్లింది.

 

మూడు రాజధానులకు చాలా వరకు అనుకూలంగా ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాస్త వ్యతిరేకిత ఉన్నట్లు అర్ధమైంది. అయితే ఇటీవల కేంద్రం కూడా రాజధానిపై తాము పట్టించుకోమని చెప్పడంతో కాస్త పరిస్తితి మారినట్లు తెలిసింది. ఇంకా ఏమన్నా వ్యతిరేకిత ఉంటే త్వరలో జగన్ తీసుకు రానున్న అద్భుత పథకంతో మొత్తం పరిస్తితులు మారిపోతాయని తెలుస్తోంది. ఉగాదికి జగన్ 25 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. దీనివల్ల అనేక కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. అయితే ఇదే అంశం జగన్‌పై వ్యతిరేకిత పోగొట్టడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత అడ్వాంటేజ్ పెరిగేలా చేస్తుందని తెలుస్తోంది. మొత్తానికైతే కరెక్ట్ టైమ్‌లో జగన్‌కు పరిస్తితులు అనుకూలంగా మారనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: