అబ్బో ఎన్నడు లేనిది పాకిస్దాన్ వేదాలు వల్లిస్తుంది. ప్రజల ప్రాణాలను దోమల్లా నలిపేసే వారికి, మాన ప్రాణ విలువలంటే తెలియని పాకిస్దాన్‌కు, ఉగ్రవాదుల్ని ఇంటి చుట్టాల్లా పోషించే దాయాదికి ఇంత జ్ఞానోదయం కలిగిందంటే బుద్ది ఉన్నవారు ఎవరు నమ్మరు.. ప్రపంచదేశాలను నాశనం చేయాలనే మూర్ఖత్వంతో, ఎక్కడపడితే అక్కడ మానవ బాంబులను తయారు చేసి పంపిస్తూ, అమాయకుల రక్తాన్ని ఆరెంజ్ జ్యూస్‌లా పీల్చే ఈ రాక్షస దేశానికి బుద్దివచ్చిందా, ప్రాణం విలువ తెలిసివచ్చిందా అని ప్రతి వారు ముక్కున వేలేసుకుంటున్నారు..

 

 

మరికొందరైతే బుద్ది ఉందా ఇన్నాళ్లూ చేసిందంతా చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నావా.. నీవల్ల మా భారతదేశం కన్నీటితో నిండిపోయింది.. అంటే నీ దేశంలో బ్రతికే ఆడపిల్లలు మాత్రమే మనుషులా, మిగతా దేశాల ఆడవారు మనుషులు కాదా, పశువుల్లా మారి మీరు చేసిన సిగ్గుమాలిన పని ఏంటంటే 2001 సెప్టెంబర్‌ 11న న్యూయార్క్‌లోని ‘ట్విన్‌ టవర్స్‌’పై మీరు చేసిన విమాన దాడి యావత్‌ ప్రపంచాన్నీ వణికించింది. సాటి మనిషిలా కాకుండా నీచమైన ఆలోచనలతో నాలుగు అమెరికా ప్యాసింజర్‌ విమానాలను హైజాక్‌ చేసి మీ తొత్తులైన అల్‌ఖైదా ఉగ్రవాదులను ఉసిగొల్పి ‘వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌’లోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చి వేశారు. ఈ ఉదంతంలో 2,977 మంది పౌరులు బలయ్యారు..,

 

 

ఇదే కాకుండా సర్వమతాల సమ్మేళనంగా బ్రతికే మా అవనిని రుధిరపు ధారలతో తడిపేసారు. వరుసగా బాంబులు పేల్చి ఎందరో అమాయకులను అవిటి వారిని చేయడమే కాదు, మానవత్వంతో, ఐకమత్యంగా బ్రతికే జీవితాల్లో చీకట్లను నింపి వికృతంగా ఆనందించారు. లుంబినీ పార్క్, కోఠిలో చేసిన దాడులవల్ల ఎన్ని కుటుంబాలు అనాధల్లా మారాయో చెప్పాలంటే ఇప్పటికి నోరు పెగలడం లేదు. ఆ దృష్యాలను మా పుడమిలోని ప్రతి ఇసుక రేణువు చెబుతుంది. మా శ్వాసలోని వేడి వేడి నిట్టూర్పులు చెబుతాయి. లబ్‌డబ్ అని కొట్టుకునే మా గుండె చప్పుడు చెబుతుంది.

 

 

ఇకపోతే బలపాలు పట్టుకుని విద్య నేర్చుకునే పిల్లల చేత తుపాకులు పట్టించి, లేత మనుసులపై ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలగా రుద్దుతూ వారి బాల్యాన్ని మానవ బాంబులా మార్చే మీరు ఇప్పుడు అత్యాచారాల విషయంలో మరణ శిక్ష విధించడమా.. మీరు తప్పుచేసిన వానికి మరణ శిక్ష అనే పదం వాడటం నిజంగా నవ్వు తెప్పిస్తుంది. ఎందుకంటే నిత్యం తప్పుడు ఆలోచనలతో బ్రతికే మీ లాంటి మనుషులకు తప్పు అనే వాఖ్యం పవిత్ర భావం.. దాన్ని అపవిత్రం చేస్తానంటారా.. మీ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా ఆలోచించండి.

 

 

ఇక ‘చైల్డ్ కిల్లర్స్ మరియు రేపిస్టులకు ఉరిశిక్ష విధించడమే కాదు, వారిని బహిరంగంగా ఉరి తీయాలి’ అని పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలీ ముహమ్మద్ ఖాన్ అసెంబ్లీలో తీర్మానాన్ని సమర్పించారు కదా.. అంటే మీ దేశంలో తప్పు చేయకూడదు. కానీ పక్క దేశాల్లో మనుషుల ప్రాణాలను మాత్రం విచక్షణ రహితంగా తీయవచ్చు. ఇలా ఆలోచించడానికి కాస్తైన సిగ్గుండాలి అని పాకిస్దాన్ తెచ్చిన కొత్త చట్టం విషయాన్ని తెలిసిన నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: