ప్రస్తుతం సమాజంలో తెలుగు భాషకు తెగులు పడుతుంది.. ఉగ్గుపాలతో నేర్చుకున్న మన తెలుగు ఇప్పుడు చిన్నబోయి కన్నీరు కారుస్తుంది.. మనిషికి ఎప్పుడైనా దెబ్బతాకితే అమ్మా అంటాడే గానీ, మమ్మీ అనడు. అలాంటి మాతృభావన కలిగిన ఈ తెలుగు పాడెపైనా పడుకుని, అస్దిపంజరంలా మిగిలిపోయింది.. ఏడ్చే ప్రతివారికి కన్నీరే వస్తాయి. అది జంతువైనా, మనిషైనా, పరాయి దేశం వాడైనా.. అలాగే తెలుగు గడ్దపై పుట్టిన ప్రతివాడు ఆకలేస్తే అన్నం అనవలసిందే.. ఏడుపొస్తే అమ్మా అని ఏడవవలసిందే.

 

 

ఇకపోతే ఇంతటి ప్రాధాన్యత కలిగిన మన తెలుగు భాషా చివరికి రాజకీయ నాయకులకు కూడా లోకువై పోయింది. ప్రజాప్రతినిదులు అని చెప్పుకునే నాయకులు  అసెంబ్లీల్లో అమ్మ, అక్కలను అవమానించేలా మాట్లాడుతున్నారు.. ఈ తప్పు ఒకచోట జరురుతున్నది కాదు.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఇదే పద్ధతి కనిసిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన చెందుతున్నారట... ఇదే కాకుండా అత్యంత పవిత్రమైన పదాలను చట్టసభల్లో నాయకులు సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నారన్నారని పేర్కొన్నారు..

 

 

ఇదే కాకుండా పార్లమెంట్, శాసనసభల్లో నాయకులు వాడుతున్న భాష సిగ్గుచేటని, ఇలాంటి పరిస్థితిలో మార్పు తప్పనిసరని వెల్లడించారు.. ఇదంతా విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఈ విధంగా కలత చెందారు.. ఇకపోతే రాజకీయం చేసే నాయకులు ఒకరికొకరు ప్రత్యర్ధులే కానీ శత్రువులు కాదని గుర్తుంచుకోని, సాటి వారిపట్ల క్రమశిక్షణతో మెలగాలన్నారు... కానీ నేటి రాజకీయాల్లో ఇదే కొరవడిందని, పూర్తిగా స్వార్ధంతో నిండుకుని ఎవరికి వారే గొప్పగా ఫీలవుతూ, తమ విలువల్ని కోల్పోతున్నారని తెలిపారు..

 

 

నిజమే కదా మీ బ్రతుకుల్ని బాగుచేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే నాయకులు, ముందుగా వారి భాషను సరిచేసుకుని వస్తే బాగుంటుంది. వారిని వారే ఉద్దరించుకో లేనప్పుడు ఇక ప్రజలను ఏం ఉద్దరిస్తారని అనుకుంటు ఉన్నారట ఈ విషయం తెలిసిన సామాన్య ప్రజానీకం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: