ఏపీలో దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభమయ్యాయి. ఆడపిల్లల రక్షణ కోసం జగన్ సర్కారు దిశ చట్టం కూడా రూపొందించింది. ఇది తర్వలోనే అమలులోకి రాబోతోంది. మరి ఇంతకీ ఈ

దిశ చట్టంతో ఏం జరగబోతుంది.. ఇంతకు ముందు.. ఇప్పటికీ తేడా ఏంటి.. ఈ వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. దిశ చట్టం చాలా పవర్ ఫుల్ గా రూపొందించారు.

 

 

ఈ కొత్త చట్టం ప్రకారం.. ఎక్కడైనా మహిళలపై గానీ, పిల్లల మీద గానీ అత్యాచారాలు, అఘాయిత్యాలు, వారి మర్యాదకు భంగం కలిగించే నేరాలు ఎక్కడైనా జరిగితే.. వాటిల్లో రెడ్‌హ్యాండెడ్‌ కేసులు ఉంటే 7 రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. ఏకంగా ఉరిశిక్ష వేయడానికి అనువుగా చట్టాన్ని రూపొందించారు. రెడ్‌హ్యాండెడ్‌గా ఒక ఘటన జరిగిన తరువాత కూడా వదిలేస్తే.. ఆ తరువాత ఈ వ్యవస్థలోకి ఎప్పటికీ మార్పు అనేది రాదు. మైకులు పట్టుకొని మాట్లాడడం తప్ప మార్పు రాని పరిస్థితి ఉంటుంది.

 

 

అందుకే జగన్ సర్కారు సీఆర్‌పీసీ, ఐపీసీ చట్టాల్లో కావాల్సిన మార్పులు చేసింది. ఈ చట్టం సెంట్రల్, స్టేట్‌ రెండింటి మధ్య ఉన్న సబ్జెక్టు కాబట్టి బిల్లును పాస్‌ చేసి కేంద్రానికి పంపించింది. కేంద్ర హోంశాఖ నుంచి బిల్లు కదులుతుంది. ఈ బిల్లు చట్టం రూపంలోకి వస్తే.. ఆడవాళ్లపై అఘాయిత్యం చేయాలంటేనే మృగాళ్లు వణికిపోతారు.

 

 

అయితే కేవలం దిశ చట్టం రావడంతోనే అన్నీ సెట్ అయినట్టు కాదు.. పిల్లలు, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై వెంటనే శిక్ష విధించేందుకు 13 జిల్లాల్లో 13 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలి. అందుకే వీటి కోసం జగన్ సర్కారు రూ. 26 కోట్లు మంజూరు కూడా చేసి హైకోర్టుకు అభ్యర్థించింది. హైకోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన వెంటనే ప్రతి జిల్లాల్లో డెడికేటెడ్‌ ఎక్స్‌క్లూజివ్‌ కోర్టు దిశ మీద ఉంటుంది. 13 కోర్టుల్లో 13 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను వెంటనే నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. స్పెషల్‌ కోర్టుల కోసం రూ.25.74 కోట్లు, స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల కోసం రూ.1.65 కోట్లను మంజూరు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: