మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  తనయుడు లోకేష్ మిత్ర బృందం కంపెనీ వ్యవహారంలో చేసిన ఓ చిన్న పొరపాటు భవిష్యత్తులో రాజకీయంగా 'బద్నాం' చేసే సమస్యగా మారనున్నది. బాబు కుటుంబానికి సన్నిహితుడైన కిలారు రాజేష్ పై సోదాలు జరుగుతున్నాయి.  నారా లోకేష్ పార్టనర్‌‌గా ఉన్న ఆశ్వాస్ హెల్త్ కేర్ కంపెనీ తెర మీదకు వచ్చింది. దాంతో పాటు లోకేష్ డైరెక్టర్‌గా ఉన్న కంపెనీలు, వాటి లావాదేవీలు చర్చల్లోకి వస్తున్నాయి. మాజీ పిఎస్ శ్రీనివాస్ ఓ కోటిని 14సార్లు 'డ్రా' చేశారు. ఇదే ఆయన్ని పట్టించింది. ఇక 'అద్దె' కొంపలో ఉంటూ..తెల్సినోళ్ళ దగ్గర దొరికిన కాడికి లక్ష, రెండు లక్షలు సీరియస్ గా తీసుకొని.. సరదాగా ఎగ్గొట్టే దిరిశాల నరేష్ చౌదరి.. ఏకంగా రూ. 69 కోట్ల ఇన్ వాయస్ నొక్కుడు వెనుక ఓ పెద్ద వ్యవహారం నడిచింది. 

 

పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ 'ఫ్రాంక్లిన్ టెంపుల్టన్' అనే డమ్మీ కంపెనీని 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారనీ, 1000 కోట్ల భూమిని అప్పనంగా ఇచ్చారనీ తప్పుడు మాటలు చెప్పాడని కొందరు తిట్టిపోస్తున్నారు కదా… సదరు కంపెనీకి వందలేళ్ల చరిత్ర ఉందనీ గుర్తు చేస్తున్నారు కదా… కానీ ఇప్పుడు ఏమైంది..? 'ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్' పేరిట నిజంగానే ఓ కొత్త కంపెనీ పుట్టుకొచ్చిందనీ, దీనికి తోడు 'ఇన్నోవా సొల్యూషన్స్' కూడా సృష్టించబడిందనీ… నేరుగా చంద్రబాబు సీఎంఓ నుంచి లావాదేవీల ఫైళ్లు కదిలాయని బయటపడింది. ఎవరో వెలగపూడి రాజకుమార్ అట… ఇంకా ఎంత తవ్వితే, ఇంకేం బయట పడుతుందో మరి.

 

ఇక భూ లావాదేవీలపై తాజా ప్రభుత్వం స‌మ‌గ్ర స‌మాచారంలో అరడజను మంత్రులు, డజను మంది ఎంపిలు, ఎం.ఎల్.ఏలు, రెండు డజన్ల మంది తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆ ప్రాంతంలో భూములు కొన్న‌ట్లు వెల్ల‌డైంది. మొత్తానికి ఇదంతా మాజీ మంత్రి నారాయణ మెడకు చుడుతున్నట్లు తెలుస్తోంది. వీళ్ళను బాబు ఎలా రక్షించుకుంటాడనేది ఆసక్తికరం. ఈనెల 5న చిలకలూరిపేటలోని పత్తిపాటి పుల్లారావు అనుచరుడు పొట్టి రత్నబాబు బంగారు దుకాణాలపై జరిపిన దాడుల్లో దొరికిన లింకులను బట్టి.. ఐటి అధికారులు ముందుకు సాగారు. ఇదంతా చంద్రబాబు టార్గెట్‌గా సాగుతున్నవే అనేది నిజం. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధుల్ని ఏయే ఖాతాల నుంచి, ఏయే మార్గాల్లో పూలింగు చేశారో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నది.

 

నిజానికి బీజేపీ టార్గెట్ అదే…! దానికి 'అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగు' అనేది అంత ప్రయారిటీ అంశం కాదు. కాకపోతే ఈ దర్యాప్తుల్లో అవి కూడా బయటపడితే, అది జగన్‌కు ఉపయోగకరం. తర్వాత ఈడీ విచారణకు కూడా ఉపయోగపడుతుంది. సోదాలు జరిగినంత మాత్రాన వాళ్లందరూ ఆర్థిక నేరాల్లో ఉన్నట్టే లెక్క కాదు. పక్కాగా ఆధారాలు సేకరించి, దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తేనే కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు రూపంలో దొరికిన ఓ ఆర్థిక అండను  తెగ్గోసినట్టు' అవుతుంది. ఫలితంగా బాబు భవిష్యత్తులో తొమ్మిది సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: