చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ చీప్ గా  కీలక బాధ్యతలు నిర్వహించిన ఏబి  వెంకటేశ్వరరావుపై  జగన్మోహన్ రెడ్డి సర్కారు సస్పెన్షన్ వేటు  చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు పై క్రమశిక్షణా చర్యలు కింద... చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి సర్కారు రాత్రికి రాత్రే జీవో విడుదల చేసింది. విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ దాటి  పోవద్దు అంటూ ఏబి  వెంకటేశ్వరరావును  హెచ్చరించింది ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబి వెంకటేశ్వరరావు అప్పట్లో చంద్రబాబు అక్రమాలకు కొమ్ము కాసాడు  అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉండి చంద్రబాబు అక్రమాలు చేపట్టినా దానికి అండగా ఉన్నారని తాజాగా జగన్ సర్కార్ కూడా ఆరోపించింది. 

 

 అయితే ప్రధానంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఏబీ వెంకటేశ్వర రావు పై చేసిన వివిధ అభియోగాలు మోపింది. అందులో మొదటిది మొదటిది గ్లాస్ మిస్ కండక్ట్ . క్రిటికల్ ఇంటిలిజెంట్ అండ్ సర్వే లైన్స్ కాంట్రాక్టులో ఇజ్రాయిల్ కంపెనీ తో కుమ్మక్కయి ఏబీ వెంకటేశ్వరరావు అక్రమంగా తన కుమారుడికి చెందిన కంపెనీకి తెప్పించుకున్నారు అని జగన్ సర్కార్ ఆరోపణలు చేసింది. ఇలా చేయడం నేరుగా విదేశీ రక్షణ తయారీ సంస్థ తో సంబంధాలు పెట్టుకోవడమేనని... సర్వీస్ ఎథికల్  కోడ్ను ఉల్లంఘించారని అంటూ ప్రభుత్వం ఆరోపించింది. ఇక రెండో అభియోగం ఏమిటంటే... ఏపీ ఇంటిలిజెన్స్ చీపుగా కీలక బాధ్యతలు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావు చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారత దేశానికి మొత్తం ముప్పు ఏర్పడుతుందని జగన్ సర్కార్ ఆరోపించింది. 

 

 ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు... రాష్ట్రానికి దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇజ్రాయిల్ కంపెనీలకు చేర వేస్తున్నారని జగన్ సర్కార్ ఆరోపిస్తోంది. ఇంటిలిజెన్స్ ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీజర్ ఉద్దేశపూర్వకంగానే ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు అంటూ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఏబి  వెంకటేశ్వరరావు పై అభియోగం మోపింది. అలాగే ఎక్విప్మెంట్ ను కూడా సబ్ స్టాండర్డ్  కోన్నారని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహస్యాలను కూడా ఆక్సిస్ చేశారని.. దానివల్ల ఇంటిలిజెన్స్ చీఫ్ గా కొనసాగిన ఏబీ వెంకటేశ్వరరావు ఎంతో లాభం పొందారు అంటూ జగన్మోహన్రెడ్డి సర్కార్ ఆరోపణలు చేస్తోంది. అంతేకాకుండా టెండర్లు అక్రమాలకు పాల్పడటం, మొత్తం వ్యవహారంలో ఎన్నో ఇర్రెగ్యులేటరీస్ ఉండటం, సీనియర్ ఆఫీసర్ లపై అమర్యాదగా ప్రవర్తించడాన్ని ఇలాంటి అభియోగాలను ఏబి  వెంకటేశ్వరరావు పై మోపినది  జగన్ సర్కారు. మొత్తంగా ఏబీ వెంకటేశ్వరరావు పై అభియోగాలు మోపి అర్ధరాత్రి హడావిడిన  వేటు వేస్తున్నట్లు గా జీవో జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కారు

మరింత సమాచారం తెలుసుకోండి: