ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గత వారం రోజులలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా పలు చర్యలు చేపట్టింది. గత వారం రోజులలో ఏపీ సీఎం జగన్ మహిళలకు భద్రత కల్పించటం కోసం దిశ పేరుతో శ్రీకారం చుట్టిన పోలీస్ స్టేషన్ ను నిన్న రాజమండ్రిలో ప్రారంభించారు. అమరావతి ప్రాంత రైతులతో చర్చలు జరిపి రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

                 

శుక్రవారం రోజున సీఎం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నా న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సీఎం జగన్ కోర్టుకు హాజరు కాలేదు. సీఎం జగన్ విశాఖ ప్రాంత అభివృద్ధి కొరకు కొత్త డీపీఆర్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం జగన్ అతి త్వరలో మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు పథకాన్ని అమలులోకి తీసుకొనిరాబోతున్నట్టు తెలిపారు. 

 

వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని తరలింపు ప్రారంభమైందని మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి తెలుదేశం పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. ఏపీఐఐసీ ఛైర్మన్ నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా వైసీపీ ఎంపీలతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన రోజా రహదారి 205 కు సంబంధించిన పలు సమస్యలను నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.

 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి నగరి నియోజకవర్గ రైల్వే సమస్యలను మంత్రికి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ ఎంపీ కేశినేని మైలవరం నియోజకవర్గానికి అడిగిన వెంటనే ఎంపీ నిధుల నుండి నిధులు మంజూరు చేయటంపై ప్రశంసలతో ముంచెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: