ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న మాయదారి ప్రాణాంతకమైన వైరస్ కరోనా . చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వనికిస్తోంది. ఇక చైనాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోగా..వేల సంఖ్యలో ఈ వైరస్ సోకి ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. అయితే ఇప్పటికే భారతదేశంలో కూడా కరోనా వైరస్ ప్రవేశించిన విషయం తెలిసిందే. కేరళలో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. ఇక భారత దేశంలో కూడా రోజురోజుకు ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అటు హైదరాబాద్ నగరంలో కూడా గతంలో కరోనా  అనుమానితులు ఉండగా... ఇప్పుడు తాజాగా మరోసారి హైదరాబాద్ నగరంలో కరోనా  కలకలం రేపుతోంది. 

 

 తాజాగా తొమ్మిది మందికి ఈ వైరస్  అనుమానితులు  గాంధీ ఆస్పత్రిని ఆశ్రయించారు. వీరికి జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు ఉండడంతో బాధితులు వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. అయితే ఇప్పటివరకు కరోనా  వైరస్ సోకింది అని అనుమానించిన వారిని 70 మందికిపైగా హైదరాబాదులో పరీక్షలు నిర్వహించగా... 62 మందికి కరోనా  నెగిటివ్ వచ్చింది. ఇక మిగితా వారి రిపోర్టులు రావాల్సి ఉంది.దీనికి  సంబంధించిన సమాచారాన్ని గాంధీ హాస్పిటల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు. ఇక తాజాగా మరో తొమ్మిదిమంది కరోనా  సోకిందనే అనుమానం తో గాంధీ ఆస్పత్రిని సంప్రదించడంతో... వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని తెలిపారు. 

 


 అయితే రోజురోజుకు నగరంలో ఈ వైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో మరో పది పడకల ఐసోలేషన్ వార్డులు  నిర్వహిస్తున్నట్లు తెలిపారు గాంధీ ఆస్పత్రి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. ఇప్పటివరకైతే ఎవరికీ ఈ వైరస్ సోకాలేదని... సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు అంటూ అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో మరో వైపు స్వైన్ ఫ్లూ కూడా విజృంభిస్తుంది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ కేసులు కూడా నమోదయ్యాయి. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలుపుతున్నారు. కాగాకరోనా  సోకింది అంటూ అనుమానంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో స్వైన్ ఫ్లూ కేసులు ఉండడం కూడా గమనార్హం. ఏదేమైనా ప్రస్తుతం ఈ మాయదారి ప్రాణాంతకమైన వైరస్ హైదరాబాద్ ను కూడా బెంబేలెత్తిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: