మారుతున్న స‌మాజ ప‌రిస్థితులు, ఒత్తిళ్ల నేప‌థ్యంలో చాలా మంది సెల‌వుల‌ను కూడా స‌రిగా ఎంజాయ్ చేయ లేక‌పోతున్నారు. ఇక వారంతం వ‌చ్చినా కూడా ఏదో ఒక ప‌నులు స‌రిపోతున్నాయి. దీంతో కుటుంబాల‌కు అస్స‌లు గ‌డ‌ప‌డం లేదు. వీకెండ్ జోష్ అనేది ఇటీవ‌ల మిస్ అవుతోంది. వారం అంతా క‌ష్ట‌ప‌డి చివ‌ర‌కు వీకెండ్ కూడా కుటుంబానికి కేటాయించ‌పోవ‌డం అనేది దారుణ మైన విష‌య‌మే అని చెప్పాలి. ఇక వీకెండ్‌లో ఎంజాయ్‌తో పాటు కొన్ని ప‌నులు కూడా మ‌నం మ‌ర్చిపోకూడ‌దు. శ‌నివారం వారాంతం కావ‌డంతో ఇంటి ప‌నుల‌కూ స‌మ‌యం దొరికే అవ‌కాశం ఉంటుంది. శారీర‌క వ్యాయామం రోజు చేస్తున్నా.. శ‌నివారం మ‌రింత సేపు స‌మ‌యం కేటాయించే అవ‌కాశం ఉంటుంది.

 

సండే వ‌చ్చిందంటే.. ఎలాంటి సంద‌ర్భాలూ అక్క‌ర‌లేకుండానే కుటుంబంలోని ప్ర‌తి ఒక్క‌రూ క‌లివిడిగా సంద‌డి చేసుకునేందుకు రెడీ అవ్వాలి. ఎక్క‌డ ఉన్నామ‌నేది ముఖ్యం కాకుండా.. ఎలా ఉన్నామ‌నే కాన్సెప్ట్‌తో ముందుకు సాగితే.. సండేల‌న్నీ పండ‌గ‌లు గానే మ‌న జీవితంలో మిగిలి పోతాయి. అయితే ప్ర‌తి ఒక్క‌రు త‌మ జీవితాన్ని ఇలా ప్లాన్ చేసుకోవ‌డంలోనే అస‌లు ఆనందం ఉంటుంది. శ‌నివారం... ఆదివారం రెండు రోజులూ సెల‌వు దొరికే ఉద్యోగులు శ‌నివారం ఇంట్లోనే కుటుంబంతో కేటాయించ‌డం ద్వారా ఆదివారం ఔట్ చేసేందుకు అకాశం ఉంటుంది.

 

సండే సాయంకాలాలు చాలా డిఫ‌రెంట్.  ఆ వేళ అంద‌రూ క‌లిసి మూవీనో.. ఎగ్జిబిష‌న్‌కో.. లేదా బీచ్‌కో వెళ్ల‌డం ద్వారా ఆ ఆహ్లాద‌మే భిన్నంగా ఉంటుంది. బీచ్ ద‌గ్గ‌ర లేదా టెంపుల్స్ లేదా నదీ తీరాలు ఇలా చెప్పుకుంటూ పోతే మంచి అంద‌మైన ప్ర‌దేశాలు ఎంచుకుని అక్క‌డ ఎంజాయ్ చేస్తే ఆ మ‌జానే వేరుగా ఉంటుంది. శ‌ని, ఆదివారాలు అన‌గానే కుటుంబం మొత్తానికి ఒక రిలాక్స్ డే!. అయితే, ఆరోజు చాలా మంది అప్ప‌టి వ‌ర‌కు పెండింగ్ ప‌నుల‌ను ముందేసుకుంటారు. కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల అంద‌రిలోనూ తీవ్ర ఆవేద‌న పెరిగిపోతుంది. సో.. మీ ప‌ర్స‌న‌ల్ పెండింగ్ ప‌నులు ఏమైనా ఉంటే. ఆ హాఫ్ డే సెల‌వు పెట్టుకుని పూర్తి చేసుకుంటే బెట‌ర్‌.. సండేలు మాత్రం పూర్తిగా ఫ్యామిలీకే డెడికేట్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: