ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత కాలం మనిషి ఎక్కువగా ధనార్జనకు ఇచ్చిన ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వడం లేదు అనే చెప్పాలి. ఇక దానితో పాటు కాలం మార్పు వలన ప్రతి ఒక్కరికి ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఎక్కువగా పొద్దున్న నిద్దుర లేచిన దగ్గరి నుండి ఎవరి పనుల గురించి వారు ఆలోచించి రెడీ అయి ఆఫీసులకు వెళ్లిపోవడం, మధ్యాహ్నం ఇంటి నుండి తెచ్చుకున్న భోజనం చకచకా లాగించేసి మళ్ళి తమ పనిలో నిఘ్నం అయిపోవడం, సాయంత్రం సమయంలో అక్కడే ఆఫీసులో ఒక టీ కొట్టేసి, మళ్ళి రాత్రి సమయానికి ప్రయాణావస్థలు పడి ఇంటికి చేరుకోవడం చేస్తున్నారు. 

 

వాస్తవానికి ఈ విధంగా పరిస్థితులు రాను రాను ఇలా మారడానికి కారణం, ప్రతి విషయానికి డబ్బు యొక్క ఆవశ్యకత పెరగడమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే చందాన నేడు మనిషి బ్రతుకు నడుస్తోంది అని చెప్పవచ్చు. అయితే ఎప్పుడూ రెగ్యులర్ గా సాగె ఈ లైఫ్ కు ప్రతి వారం వచ్చే వీక్ ఎండ్స్ లో సరదాగా మన కుటుంబంతో, అలానే ఫ్రెండ్స్ తో కలిసి అలా హాయిగా ఏ చిన్న టూర్ కో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తే నిజంగా దానివలన మానసికంగా కొంత ఉత్సాహం కలగడం తో పాటు మనలో చురుకుదనం పెరుగుతుంది అని చెప్పవచ్చు. 

 

శ‌నివారం-ఆదివారం రెండు రోజులు సెల‌వు చిక్కే కుటుంబాల వారు షార్ట్ టూర్ ప్లాన్ చేసుకుంటే ఆ హ్యాపీనే వేరుగా ఉంటుంది. అంద‌రూ ఒకే చోట‌కు చేరుకుని అక్క‌డే క‌లిసి భోజ‌నాలు, వినోదాలు, ఆట‌ పాటలు సరదాగా అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవడం వంటివి మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు ఉత్తేజాన్ని అందిస్తుంది. ఇక తరువాత నుండి ఎలాగూ రెగ్యులర్ లైఫ్ లో ఉరుకులు పరుగుల కామన్ కాబట్టి, కాస్త ఆ రెండు రోజులైనా ఎంజాయ్ చేయండి, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: