ఏపీలో రాజకీయాలు రోజుకో తీరుగా మారుతున్నాయి. ఇదే కాకుండా రాజధాని రగడ ఎలాగు తలనొప్పిగా తయారైయ్యింది.. ఇది చాలదన్నటుగా ఇప్పుడు మరో సమస్య తయారై కూర్చుంది. అదేమంటే జగన్ కలల ప్రాజెక్ట్ అయిన పోలవరానికి పెద్ద వేటుపడింది. ఇప్పటికే ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటి నుండి అనుకోని విధంగా ఎన్నో అడ్దంకులు ఎదురవుతుండగా, అన్నీంటిని సమన్వయ పరచుకుంటూ ముందుకు వెల్లుతున్న జగన్ సర్కార్‌కు పోలవరం విషయంలో మాత్రం మింగుడు పడటం లేదు.
 
 
ఇకపోతే గతేడాది డిసెంబర్‌ నెలలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు విచారణ కూడా చేపట్టింది.. ఇకపోతే ఉమ్మడి ఏపీలోని ప్రజలు 70ఏళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం పోరాడుతున్నారు. నాటి నుండి నేటివరకు ఎందరో నాయకులు మారారు. ఏ నాయకుడు కూడా ఏపీ సాగు - తాగు నీటి కష్టాలు తీర్చే ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఇదే కాకుండా చంద్రబాబు హయాంలో కేంద్రం సాయంతో పోలవరం అంటూ మొదలు పెట్టినా అందులోని కమీషన్ల కక్కుర్తి,  పర్సంటేజీల జాప్యంతో అనుకున్న విధంగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేకపోయారని ప్రతిపక్షాలు ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి.
 
 
అయితే కనీసం జగన్ ప్రభుత్వం అయినా ప్రాజెక్టును పూర్తి చేస్తారని అనుకున్న ప్రజల ఆశలు నెరవేరే విధంగా అడుగులు పడుతున్న సమయంలో రివర్స్ టెండరింగ్ పిలిచి మేఘా సంస్థకు అప్పగించారు. కాళేశ్వరం కట్టిన ఈ సంస్థ ఇప్పుడు వడివడిగా 2021లోపే పోలవరాన్ని పూర్తి చేయాలని వేగవంతంగా నిర్మాణం చేస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వానికి అనుకోని షాక్ తగిలింది.
 
 
ప్రాజెక్టుకు నిర్మించడం వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతుందని.. నిర్మాణాన్ని ఆపివేయాలని ఒడిషా  సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం చర్చాంశనీయంగా మారింది.. ఇదే కాకుండా తమ రాష్ట్రంలో పోలవరం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల విషయాన్ని తేల్చకుండా ముందుకెళ్లడం అన్యాయమని ఒడిషా పేర్కొంది. దీంతో ఏపీ కలల ప్రాజెక్టుకు మరో విఘాతం ఏర్పడినట్లు అయ్యింది..
 

మరింత సమాచారం తెలుసుకోండి: