తరతరాలుగా కొనసాగుతున్న తీరు ఏమిటంటే పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాలు మరియు రాజకీయ పరిణామాలపై సమన్వయం పేరుతో భారత మీడియా అసలు పట్టించుకోదు కానీ భారతదేశంలో చిన్న విషయం జరిగిన దానిని అంతర్జాతీయ సమస్యగా పాక్ పరిగణిస్తూ ఉంటుంది. అక్కడ మైనార్టీల పైన ఎన్ని అఘాయిత్యాలు నేరాలు జరిగినా పొరుగు దేశం వారు తలదూర్చకూడదు కానీ భారతదేశంలో మైనార్టీల పైన చిన్న చట్టం తీసుకొని వచ్చినా వారు దానిని తీసుకుని వెళ్లి అంతర్జాతీయ సదస్సులో పెట్టేస్తారు. అయితే ముందు వారి దేశంలోని చట్టాలను మరియు పరిస్థితిని వారు చక్కదిద్దుకొని మాట్లాడితే బాగుంటుందని అంతా అంటున్నారు.

 

వివరాల్లోకి వెళితే మధ్యనే పాకిస్తాన్ లో ఒక మైనారిటీ యువతి పై మానభంగం జరగగా అక్కడి వారు దానికి కారణమైన అతనితో బాధితురాలికి పెళ్లి జరిపించింది. అక్కడ అన్యమతస్తులని పెళ్లి చేసుకోవడం మతపరంగా తప్పు అయినా కూడా అతను పాల్పడ్డ  నేరానికి అదే సరైన గుణపాఠం అని కూడా అందులోనే వెరసి ఉంది. అయితే ప్రస్తుతం సి.. చట్టం ప్రవేశపెట్టిన అనంతరం భారత్ ను పడగొట్టేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ లో ఇప్పుడు వచ్చిన కొ త్త అనధికార చట్టం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

 

విషయమేమిటంటే అన్యమతస్తులు తమ దేశంలో సురక్షితంగా ఉండాలి అంటే వారి కూతుర్లలో కనీసం ఒక్కరినైనా తమ వారికి ఇచ్చి పెళ్లి చేయాలి అన్నట్లు అక్కడి పరిస్థితి నెలకొందట. అసలు పాకిస్తాన్ ఆలోచన తీరు ఎలా ఉందో తెలియదు కానీ వారి దేశంలో సురక్షితంగా బ్రతకాలంటే కేవలం వారి మతం లోకి మారడమే ఉన్న ఒక్క పరిష్కారం అంటూ అక్కడి అన్యమతస్తులు వాపోతున్నారు. అలాగే తమ కూతుళ్లను ఇష్టం లేని వారికి ఇచ్చి ఎలా కట్టబెట్టాలి అని వారు ప్రశ్నిస్తున్నారు. విధంగా చూసుకున్నా ఇతర మతస్తులు, జాతీయులు మరియు దేశస్థులకు భారత దేశంలో ఉన్నంత రక్షణ ఎక్కడా లేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: