అవును, మీరు విన్న‌ది నిజమే. స్పిరులినా  అనే పేరున్న ఈ మొక్క‌కు చెందిన ఆకు పొడిని నిత్యం కొంత మోతాదులో సేవిస్తే చాలు, దాంతో మీకు ఎంతో ఆరోగ్యం క‌లుగుతుంది. అంతేకాదు, దీన్ని తీసుకుంటే ఇత‌ర ఏ పోష‌కాహారం తీసుకోవాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే, ఇందులో ఉండే పోష‌కాలు అలాంటివి, ఇలాంటివి కాదు. త‌ల్లిపాల‌లో ఉన్న‌న్ని పోష‌కాలు ఈ మొక్క‌లో ఉంటాయి. అవును. అందుకే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ  దీన్ని అత్యంత పోష‌కాలు క‌లిగిన ఆహారంలో త‌ల్లిపాల త‌రువాత చేర్చేసింది. 1975లోనే ఆ సంస్థ ఈ మొక్క పొడిని అత్యుత్త‌మ ఆహారంగా తేల్చి చెప్పింది. అయితే మీకు ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం ఇంకోటేమిటంటే, ఈ మొక్క ఉత్ప‌త్తి మ‌న దేశంలోనే ఎక్కువ‌గా అవుతుండ‌డం. అవును, కానీ దీని గురించి దాదాపుగా చాలా మందికి తెలియ‌దు. అయితే ఈ మొక్క పొడిని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

స్పిరులినా మొక్క ఆకుల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎంతంటే సాధారణ పాల‌క‌న్నా 26 రెట్లు అధికంగా. అవును. దీంతో ఎముక‌ల‌కు ఎంతో బ‌లం క‌లుగుతుంది. దేహ నిర్మాణానికి, క‌ణ‌జాలాల మ‌ర‌మ్మ‌త్తుల‌కు, కొత్త క‌ణ‌జాలం పెరిగేందుకు ప్రోటీన్లు ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే స్పిరులినా పొడిలో దాదాపు 60 శాతం వ‌ర‌కు ప్రోటీన్లు ఉంటాయి. మ‌న‌కు ల‌భిస్తున్న అన్ని ఆహార ప‌దార్థాల్లోకెల్లా అత్యంత గ‌రిష్టంగా ప్రోటీన్లు క‌లిగిన ఆహారం ఇదే. నాన్ వెజ్ తిన‌ని వారు దీని పొడిని తీసుకుంటే చాలు. ఎన్నో ప్రోటీన్లు ల‌భిస్తాయి.

 

శ‌రీర పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన అమైనో యాసిడ్లు, ఐర‌న్‌, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ స‌మృద్ధిగా ఉంటాయి. ర‌క్తాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో క్లోరోఫిల్ బాగా ప‌నిచేస్తుంది. ప‌లు ర‌కాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది.
లివ‌ర్‌ను శుభ్ర ప‌రుస్తుంది. మ‌ధుమేహం ఉన్న‌వారికి మేలు చేస్తుంది. వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. 

 

గుండె సంబంధ వ్యాధులు రావు. వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలోని హార్మోన్ల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి చ‌క్క‌ని మందుగా ప‌నిచేస్తుంది. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: