జీవితం అంటే ఏంటని అనే విషయాన్ని ఎంత మంది ప్రవచన కర్తలు బోధనల రూపంలో తెలియపరచిన, వినడమే కానీ నిజమైన అర్ధాన్ని గ్రహించలేక పోతున్నారు.. నిజానికి జీవితం గాలిబుడగ లాంటింది. రూపాన్ని సంతరించుకున్న దేహంతో, కనిపించని ఆత్మను లోన దాచుకుని మాయను పట్టుకుని వేలాడుతుంది. అసలు మనిషి జీవితం ఎంత దుర్లభమైనదో చైనాలో వచ్చిన కరోనా వైరస్ బాధితులను చూస్తే తెలుస్తుంది.

 

 

ఇప్పుడు ఆ దేశంలో రక్త సంబంధాలకు విలువ లేదు. నా అనేవారు లేని అనాధల్లా మిగిలారు. ఆప్తులంతా భయంతో దగ్గరికి రావడం లేదు. కనీసం కన్నతల్లి కూడా తమ పిల్లలను దూరంగా చూస్తూ కన్నీరు పెట్టుకునే దుస్దితి. నిజంగా అక్కడ కనిపించే ప్రతి దృష్యం కంటతడి పెట్టించేదే.. మొన్నటి వరకు తిరుగు లేని ఆధిపత్యాన్ని చలాయించిన చైనా ఒకే ఒక్క వ్యాధితో ప్రపంచ దేశాలకు దూరంగా బ్రతక వలసిన పరిస్దితి తలెత్తింది..

 

 

ఇదంతా ఒకెత్తైతే కరోనా వ్యాధిగ్రస్తులకు సేవలందించే సిబ్బంది బాధలు చాలా దయనీయం.. ముఖ్యంగా కట్టుకున్న వారికి, కన్న వారికి దూరంగా బ్రతుకుతూ సేవలు అందిస్తున్నారు.. కనీసం తమ సొంతవారిని చూసేందుకు కూడా సమయం చిక్కడం లేదు. ఒకవేళ ఇంటికి వెళ్లిన ఈ మాయదారి కరోనా వైరస్‌ ఎక్కడ తమ కుటుంబికులను సోకుతుందనే ఆందోళనతో హాస్పిటల్‌లోనే రోగుల మధ్య గడిపేస్తున్నారు. ఆ వైరస్ వారిపై కూడా దాడి చేస్తుందని తెలిసినా.. ప్రాణాలకు తెగించి మరీ రోగులకు సేవలు అందిస్తున్నారు. నిజమైన సేవాభావానికి నిదర్శనంగా నిలిచిపోతున్నారు..

 

 

ఇకపోతే ప్రతి హృదయాన్ని కలిచి వేసే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమంటే చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో గల ఫుగౌ కౌంటీ పీపుల్స్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నా లియు హైయాన్ అనే నర్సు‌ గత 10 రోజుల నుంచి తన తొమ్మిదేళ్ల కుమార్తె చెంగ్ షివెన్‌ను చూడలేదు. దీంతో లియును చూసేందుకు ఆమె కూతురు హాస్పిటల్‌కు రాగా, సిబ్బంది వారిద్దరిని కలుసుకోనివ్వలేదు. ఆ పాపకు కూడా వైరస్ ప్రభలే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో కొన్ని మీటర్ల దూరంలో ఇద్దరినీ నిలుచోబెట్టారు.

 

 

దీంతో తల్లి, కుమార్తెలిద్దరూ సైగలతోనే మాట్లాడుతుకున్నారు. ‘‘అమ్మా నిన్ను చాలా మిస్ అవుతున్నా..’’ అంటూ చెంగ్ భావోద్వేగానికి గురైంది. తల్లి లియూ స్పందిస్తూ.. ‘‘నేను రాక్షసులతో పోరాడుతున్నా. వైరస్ తగ్గిపోగానే నేను ఇంటికి వచ్చి కలుస్తా’’ అని తెలిపింది. అనంతరం తన కుమార్తెకు లియూ గాల్లోనే హగ్ ఇచ్చింది. చెంగ్ తాను  తెచ్చిన ఆహారాన్ని బయట పెట్టింది. లియూ దాన్ని పట్టుకుని తిరిగి హాస్పిటల్‌ లోపలికి వెళ్లిపోయింది... నిన్నటి దాకా మనవారు అనుకున్న వారు మనకు కాకుండా పోతారు అనడానికి ఇదొక ఉదాహరణ.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: