చైనా నుండి వచ్చి ఇండియాలో బాగా ఫెమస్ అయిన యాప్ టిక్ టాక్.. ఈ యాప్ ద్వారా చాలా మంది మంచి క్రేజ్ ను అందుకున్నారు. కొందరు పిచ్చి పిచ్చి ఫెరఫార్మెన్స్ చేసి జనాలను చంపుతుంటే మరి కొందరు మాత్రం ప్రత్యేక స్థానాన్ని అందుకుంటూ ఫెమస్ అవుతూ వస్తున్నారు. రాయితీ కొందరు మాత్రం ఈ యాప్ ను ప్రేమ కలాపాలకు ఫ్లాట్ ఫామ్ లాగ వాడుకుంటున్నారు. అయితే టిక్ టాక్ ద్వారా ప్రేమలో పది తీరా అతను మోసం చేసాడని తెలుసుకున్న ఓ యువతీ పోలీసుల ముందే ప్రాణాలను తీసుకుంది.

 

లింగంపల్లికి చెందిన యువతి(20)కి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లోని మస్తాన్‌నగర్‌లో నివసించే వీరబాబు(20)తో సోషల్ మీడియా వీడియో షేరింగ్ యాప్ ‘టిక్‌టాక్'లో పరిచయం ఏర్పడింది. మూడు నెలల వీరి పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు.వారి ప్రేమ రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఆ క్రమంలో అమ్మాయి ప్రేమను ఘాడంగా అనుభూతి చెందింది. దానిలో భాగంగా అతనికి బాగా దగ్గరైంది.ఏమైందో ఏమో కానీ, వారం రోజుల క్రితం వీరబాబు తన ప్రేమను కాదన్నడంటూ ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

దీంతో ఆ యువతి, యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ఆమెను పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో ఆమె రాజీ పడుతున్నట్లు పోలీసులకు ఇచ్చిన లేఖలో తెలిపింది.మరోసారి తన తల్లితో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది సదరు యువతి. దీంతో పోలీసులు వీరబాబును పిలిపించారు. ఇద్దరితో పోలీసులు మాట్లాడుతున్న సమయంలోనే తనతో తెచ్చుకున్న బ్లేడుతో ఒక్కసారిగా తన గొంతు కోసుకుంది యువతి. దీంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.

 

వెంటనే పోలీసులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చిన్న గాయం కావడంతో పెద్ద ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. పోలీసులను ఆశ్రయించే ముందే ఆ యువతి ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘నీకన్నా ముందు నేను చనిపోతున్నానని.. తర్వాత నువ్వు ఏమీ చేసుకోవద్దు' అని యువతి.. వీరబాబుకు తెలిపింది. వీరబాబు తనను ఎందుకు పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడో ఆ వీడియోలో యువతి పేర్కొంది. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: