ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మునిగిపోతున్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఊహించని విధంగా కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. ఇన్నాళ్ళు ఏ వ్యవస్థా తనను తాకలేదని భావిస్తున్న బాబుకి ఒక్కో ఐటి దాడి చుక్కలు చూపిస్తుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న నారా వారి ఆస్థానంలో ఇప్పుడు సరికొత్త భయాలు మొదలయ్యాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే కంగారు చంద్రబాబులో కనపడుతుంది.

 

జేసి దివాకార్ రెడ్డిని ముందు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసి ఒక్కొక్కటిగా ఆయన ఆర్ధిక మూలాల మీద కొడుతుంది. అది మరువక ముందే బాలకృష్ణ చిన్నల్లుడుని బ్యాంకు లు టార్గెట్ చేశాయి. ఆ తర్వాత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కి అత్యంత సన్నిహితంగా నరేన్ చౌదరీని టార్గెట్ చేసి ఐటి దాడులు చేశారు. ఆ తర్వాత కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. మూడు రోజులుగా ఆయన ఇంట్లో సోదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ఎం స్వాధీనం చేసుకున్నారో కూడా స్పష్టత లేదు.

 

ఇక ఇప్పుడు ఇది పక్కన పెడితే చంద్రబాబు మాజీ పిఏ శ్రీనివాస్ ని టార్గెట్ చేసుకుని ఐటి అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఆయన మూడు నివాసాలలో దాడులు జరుగుతున్నాయి. మూడు రోజులుగా అసలు ఎవరికి సమాచారం లేకుండా ఈ దాడులు జరుగుతున్నాయి. దీనితో టీడీపీ ఆందోళన మొదలయింది. క్రమంగా చంద్రబాబుని టార్గెట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు ని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపోతే

 

చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడిగా ఎంతో ఆప్తుడిగా పేరొందిన మరొక వ్యక్తిపై కూడా త్వరలో చర్యలు తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. వరుసగా చంద్రబాబు సన్నిహితులపై ఐటీ దాడులు జరగడంతో తదుపరి టార్గెట్ తనమీదేనని తెగ వర్రీ అయ్యిపోతున్నారట సదరు నేత. అంతేకాదు మరిన్ని దాడులు మరింతమంది నేతలపై జరగనున్నాయని తెలుస్తోంది..ఈ పరిణామాల నేపధ్యంలో  క్రమంగా చంద్రబాబు మునుగుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది అంటున్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: