ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తనదైన శైలిలో పరిపాలన చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడా కూడా ప్రతిపక్షాలు చేసిన విమర్శలను పట్టించుకోకుండా విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధిని సమపాళ్ళలో బ్యాలెన్స్ చేస్తూ పరిపాలన సాగిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనంతపురంలో కియా మోటార్స్ వెళ్ళిపోతుంది అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు బాగా ప్రచారం చేశారని వైసీపీ నేతలు మండిపడ్డారు. అంతేకాకుండా కి యాజమాన్యం కూడా వచ్చిన వార్తలను ఖండించింది. అయితే ఆ వార్తలను ఇంటర్నేషనల్ రైటర్స్ రాసినట్లు తేలడంతో వైసీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

చంద్రబాబునాయుడు కేవలం ఎలక్ట్రానిక్ మీడియా నే కాదు ఇంటర్నేషనల్ వార్త సంస్థ రాయిటర్స్ ని మేనేజ్ చేస్తున్నాడు అని విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలకు గానూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్లు వేశాడు. చంద్రబాబు జాతీయ మీడియా ని మేనేజ్ చేశారని ఏడ్చారు ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ మీడియా ని కూడా ఆడిస్తున్నారు అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు ఏంటి విజయసాయి రెడ్డి గారు అని బుద్దా వెంకన్న కౌంటర్లు వేశారు. మీరు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్ సరైన సీఎం కాదన్నట్టుగా చేతగాని ముఖ్యమంత్రి అన్నట్టుగా మీరే ప్రింట్ వేస్తున్నట్లు డప్పు కొడుతున్నట్లు ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

అంతేకాకుండా అధికారంలో ఉన్న వైసీపీ నాయకుల బెదిరింపులు వ్యవహారంతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి పరిశ్రమలు వెళ్లిపోవడానికి ఆసక్తి చూపుతున్నాయి అంటూ మండిపడ్డారు. చెత్త పాలసీలు పారిశ్రామిక రంగంలో జగన్ సర్కార్ ప్రవేశపెడుతుందని దానివల్ల రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో పారిశ్రామికవేత్తలతో వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరించాలని వైసీపీ నేతలకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: