జగన్మోహన్ రెడ్డి ఫుల్లు హ్యాపీగా ఫీలవుతుండచ్చు. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై వివిధ సర్వే సంస్ధలు తమ అంచనాలను ప్రకటించాయి. ఈ అంచనాల్లో ఏ ఒక్కదానిలో కూడా బిజెపి అధికారంలోకి వస్తుందని అంచనా కట్టలేదు. పైగా అంచనాలన్నీ మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ మంచి మెజారిటితో అధికారంలోకి రాబోతున్నట్లు ముక్త కంఠంతో చెప్పేశాయి. సరే ఎగ్జిట్ పోన్ ఫలితాలు తప్పయిన సందర్భాలూ ఉన్నాయి లేండి. కాకపోతే అది అరుదనే చెప్పాలి.

 

ఢిల్లీ ఎగ్జిట్ పోల్ విషయంలో  గమనించాల్సిందేమంటే సర్వేలు చేసిన ప్రతిసంస్ధా కేజ్రీవాల్ కు పట్టం కట్టడం. కాబట్టి అంకెలను వదిలేస్తే కాస్త అటు ఇటుగా అయినా ఆప్ కే అధికారం ఖాయమని తేలిపోయింది.  దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో బిజెపి మట్టి కరవటం చాలామందికి మంచి హుషారునే ఇస్తుందనటంలో సందేహం లేదు. ఇటువంటి వాళ్ళల్లో జగన్ కూడా ఉంటారనటంలో అనుమానమే లేదు.

 

బిజెపి ఓడిపోవటంలో జగన్ కు ఎందుకు హుషారని అనుమానం రావచ్చు. ప్రస్తుతం కేంద్రంలోని మోడి సర్కార్  తాము అధికారంలో లేని రాష్ట్రాల విషయంలో చాలా  వివక్ష చూపుతోంది. ఇందులో ఏపి కూడా ఒకటి. ప్రత్యేకహోదా కావచ్చు, విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే ప్రత్యేక రైల్వేజోన్ కావచ్చు. పోలవరం లాంటి ప్రాజెక్టులకు రీ ఎంబర్స్ చేయాల్సిన నిధులను సరిగా ఇవ్వకపోవటం కూడా అందరికీ తెలిసిందే.

 

మొన్నటి పార్లమెంటు ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత బంపర్ మెజారిటితో బిజెపి మళ్ళీ అధికారంలోకి రావటం మన ఖర్మంటూ జగన్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమే.  రాష్ట్రాల అధికారాలను కోత వేయటంలో ప్రస్తుం మోడి చాలా దూకుడు మీదున్నారు. మొన్నటి నాలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవటంతో దూకుడు కాస్త తగ్గింది. ఇపుడు ఢిల్లీలో కూడా ఓడిపోతే దూకుడు మరింత తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన పరిస్ధితి  కేంద్రానికి వస్తే అది ఏపి లాంటి రాష్ట్రాలకు మంచిది. అందుకే ఎగ్జిగ్ పోల్స్ అంచనాల విషయంలో జగన్ పిచ్చ హ్యాపీగా ఉండుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: