40 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న చంద్రబాబు కేసుల భయంతో ఇప్పుడు నోరు కట్టేసుకుంటున్నారా.. 40 ఏళ్ల రాజకీయ ధురంధరుడు.. మోడీ దెబ్బతో గజగజావణికిపోతున్నారా.. ఎక్కువగా మాట‌్లాడితే ఎక్కడ కేసుల్లో ఇరికించేసి జైలుకు పంపుతారో అని చంద్రబాబు భయపడుతున్నారా.. అవునంటున్నారు ఏబీఎన్ రాధాకృష్ణ.

 

సాధారణంగా ఇలాంటి మాటలు వైసీపీ నాయకులు అంటుంటారు. కానీ చంద్రబాబు అనుకూలుడుగా బాగా పేరున్న ఏబీఎన్ రాధాకృష్ణ కూడా చంద్రబాబు మోడికి కేసుల భయంతో వణుకుతున్నారని రాయడం కలకలం రేపుతోంది. ఏబీఎన్ రాధాకృష్ణ ఏమంటున్నారంటే.. “ కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీ ఆడుకుంటున్నద'. ఫలితంగా రాష్ట్ర ప్రయోజనాలు గాలికి పోతున్నాయట.

 

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని అవినీతి కేసుల భయం పట్టుకోగా, తనను కేసుల్లో ఇరికిస్తారేమోనన్న భయంతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు భారతీయ జనతా పార్టీని పల్లెత్తు మాట అనలేకపోతున్నారట. ఇది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమంటున్నారు రాధాకృష్ణ. రెండు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి ఎదగాలనుకుంటున్న బీజేపీ కూడా ఆ దిశగా అడుగులు వేయడం లేదట.

 

చంద్రబాబుపై ఇన్ సైడర్ ట్రేడింగ్ ముద్ర వేస్తున్నారంటున్న రాధాకృష్ణ.. నిజంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగివుంటే నిందితులను శిక్షించడానికి ఎనిమిది మాసాల సమయం సరిపోదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్‌ అండ్‌ కో ప్రకటించిందంటున్నారు రాధాకృష్ణ. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు నిరర్ధకం అయితే, అందుకు జగన్మోహన్‌రెడ్డి కూడా బాధ్యత వహించవలసి ఉంటుందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: