రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాల గురించి స్పందించారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ కంటే అమరావతి బెటర్ అని అన్నారు. అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే బాగుంటుందని చెప్పారు. ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ ప్రతిపాదనలు చేయాలని అన్నారు. 
 
బీజేపీ పార్టీ కూడా ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణకే మద్దతు ఇస్తున్నట్టు తనకు అనిపిస్తోందని టీజీ చెప్పారు. కేంద్రం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడానికి ఒప్పుకుందని రాజధాని విభజనకు కూడా కేంద్రం పరోక్షంగా అంగీకరించినట్లే అని టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలే చంద్రబాబుకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాయని అన్నారు. అమరావతి రాజధానిగా పనికిరాదని సీఎం జగన్ ప్రకటన ఇచ్చారని ఆ ప్రకటన వలన అమరావతి ప్రజల్లో విద్వేషం కలిగిందని అన్నారు. 
 
సీఎం జగన్ అన్నీ వైజాగ్ లోనే ఏర్పాటు చేస్తానని చెబుతున్నారని సీఎం జగన్ అలా చేయటం వలన రాయలసీమ, అమరావతి ప్రజలు బాధితులు అవుతారని అన్నారు. జగన్ కర్నూలులో హైకోర్టును మాత్రమే ఏర్పాటు చేస్తామని చెబితే తాము ఒప్పుకోమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత మూడు ప్రాంతాలలో ప్రభుత్వ విభాగాలను ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. 
 
ఏపీ బీజేపీ పార్టీలో జగన్ అనుకూల వర్గమని జగన్ వ్యతిరేక వర్గమని రెండు వర్గాలు ఏమీ లేవని జగన్ మూడు ప్రాంతాలలో అన్ని విభాగాలను ఏర్పాటు చేయాలని దేశ రెండో రాజధానిగా అమరావతిని చేస్తూ ప్రతిపాదనలు పంపితే బాగుంటుందని అన్నారు. జగన్ పారిశ్రామిక వర్గాలతో వ్యవహరించే తీరును అలవరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జగన్ ఆ దిశగా అడుగులు వేయాలని టీజీ సూచనలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: