అదేమిటి ప్రాణంతక వైరస్  కరొనా  వల్ల ప్రపంచమంతా వణికిపోతుంటే మందుబాబులు మాత్రం హ్యాపీగా ఎలా ఉన్నారనే  అనుమానం వస్తోందా ?  అవునండి నిజంగానే మందుబాబులు హ్యాపీగా ఉన్నారట. ఎందుంకటే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను ట్రాఫిక్ పోలీసులు కొద్ది రోజులు  నిలిపేశారట. ఆగండాగండి మరీ అంత ఖుషీ అయిపోవద్దు. డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షలు ఆపేసింది బెంగుళూరులో లేండి హైదరాబాద్ లో కాదు.

 

జలుబు, దగ్గు తదితరాల వల్ల కరోనా వైరస్ విజృంభిస్తోందంటూ ప్రపంచమంతా వణికిపోతోంది. వాతావరణ ప్రభావం వల్ల ఎవరికి జలుబు, దగ్గు వచ్చినా చుట్టు పక్కల వాళ్ళు భయపడిపోతున్నారు. రోగుల పక్కనే ఉండి వాళ్ళు దగ్గినపుడే లేకపోతే తుమ్మినపుడో గాలి ద్వారా వైరస్ చుట్టుపక్కల వాళ్ళకు కూడా సోకుతోందనే భయం అందరినీ వణికించేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ తో ప్రపంచంలో కొన్ని వందలమంది రోగులో మరణించటంతో భయం రోజు రోజుకు పెరిగిపోతోంది.

 

ఇటువంటి నేపధ్యంలోనే  బెంగుళూరు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేమిటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసేటపుడు ఆల్కోమీటర్ ద్వారా డ్రింక్ చేసింది లేంది తెలుసుకుంటారు పోలీసులు. అయితే ఆ టెస్ట్ చేసేటపుడు ఎవరికైనా కరొనా వైరస్ ఉంటే వాళ్ళు ఆల్కోమీటర్ ను ఊదే సమయంలో బయటకు వచ్చే గాలి వల్ల పోలీసులకు, తర్వాత అదే మీటర్ ను ఇంకోళ్ళ నోటి దగ్టర పెట్టినపుడు వాళ్ళకి కూడా వచ్చే ప్రమాదం ఉందని డిసైడ్ చేశారు.

 

డాక్టర్ల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా డ్రండ్ డ్రైవ్ టెస్టులను నిలిపేయాలని బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు డిసైడ్ చేశారు. ఇంకేముంది మందుబాబులు   ఈ విషయంలో పిచ్చ హ్యాపీగా ఉన్నారు. రోడ్లపై పరీక్షలు ఆపేశారని తెలియటంతో రాత్రుళ్ళు  తాగినంత తాగేసి తూలుతు ఇళ్ళకు బయలుదేరుతున్నారు. ప్రస్తుతం బెంగుళూరులో పరీక్షలు నిలిపేశారంటే తొందరలో ఇతర ప్రాంతాల్లో కూడా అదే పని చేయకపోతారా ? అని హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ఎదురు చూడకుండా ఉంటారా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: