మాట తప్పను... మడమ తిప్పను అని జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏ విధంగా అయితే చెబుతూ వస్తున్నారో అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వ్యవహరిస్తూ ప్రజల మనసు గెలుచుకున్నారు. దేశవ్యాప్తంగా నిజాయితీగల ముఖ్యమంత్రి ఎవరు అంటే ఖచ్చితంగా ముందు వరుసలో జగన్ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. తన ప్రభుత్వంలోనూ, పాలనలోనూ ఎక్కడా అవినీతి అనేది లేకుండా జగన్ చాలా వరకు కట్టడి చేయగలిగారు. తమ పార్టీ నాయకులతో పాటు అధికారులు కూడా అవినీతి వ్యవహారాలకు పాల్పడకుండా ఆదేశాలు జారీ చేసిన జగన్ దీనిని ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

 


 ప్రతి పథకం పేదలకు అందాలనే ధ్యేయంతో జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా... తన క్యాబినెట్ మంత్రుల విషయంలో జగన్ కొంతవరకు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల లెక్కలు సరిచూసుకొని మరి జగన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని కారణంగా మొదటి నుంచి తనకు అండగా నిలబడిన వారిలో చాలామందికి జగన్ మంత్రి పదవులు ఇవ్వలేకపోయారు. అయినా వారు జగన్ ను అర్థం చేసుకుని ఎటువంటి వివాదం లేకుండా సైలెంట్ గా ఉంటున్నారు. మంత్రివర్గంలోకి తీసుకున్న కొంతమంది వ్యవహార శైలి పై విమర్శలు ఉండడంతో జగన్ కు తీవ్ర ఇబ్బందిగా మారింది.

 

 పార్టీ నాయకులు, ప్రజలతోనూ సన్నిహితంగా ఉంటూ వారు చెప్పిన విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ ఎక్కడా ఎటువంటి వివాదాలు లేకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలని జగన్ పదే పదే సూచిస్తున్నా కొంతమంది వాటిని పట్టించుకోకుండా పక్క నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నాయకుల తీరుపై జిల్లా నాయకులు మండిపడుతున్నారు. తాను చెప్పిందే వినాలి అన్నట్టుగా ఆయన వ్యవహారం చేస్తుండడంతో మిగతా నాయకులు ఎవరు ఎదగకుండా ప్రయత్నాలు చేయడం ఇవన్నీ జగన్ కు ఇబ్బందిగా మారింది.

 


ఉత్తరాంధ్రలోని మరో జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఓ వ్యక్తిని మంత్రిగా నియమించారు. అయితే ఆయన పార్టీ కి పెద్దగా ఉపయోగం లేకపోవడం, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నాపెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయంలో ఉన్నారు. ఇక నెల్లూరు జిల్లాలోనూ ఓ మంత్రి మొదట్లో దూకుడుగా వ్యవహరించినా ఆ తర్వాత జగన్ అతని కి గట్టిగా హెచ్చరికలు చేయడం తో సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే జిల్లాలో ఆధిపత్యం చెలాయిస్తూ పార్టీ నాయకులకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో జగన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ వెళితే జగన్ మంత్రివర్గంలో ఉన్న సగం మంది మంత్రులు జగన్ ఆలోచనలకు తగినట్టుగా వ్యవహరించకపోవడం జగన్ కు ఇబ్బందిగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: