టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా సొంత పార్టీ నాయకులతో పాటు ఒక వర్గం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. అవినీతి వ్యవహారాలకు పాల్పడడం, అందులో పార్టీ అగ్ర నాయకులకు తెలిసి కొంతమంది తెలియక కొంతమంది వ్యవహారాలు నడిపించడం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం ఇవన్నీ జరిగాయి. ఈ విషయం అప్పట్లో చంద్రబాబుకు తెలిసినా ఆయన దీనిని అరికట్టేందుకు ప్రయత్నించలేదు. ఫలితంగా ఎవరికివారు తమ ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు. ఈ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అయినా దానిని పెద్దగా పట్టించుకోకుండా అప్పటి టిడిపి పెద్దలు సైలెంట్ గా ఉండి పోయారు.


 కానీ ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ గా ఉన్న వైసిపి, కేంద్ర అధికార పార్టీ బిజెపి అవినీతి వ్యవహారాలు చూస్తూ ఊరుకునేలా కనిపించడం లేదు. అందుకే వరుసగా సిఐడి, సిబిఐ, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించి తెలుగుదేశం ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలు అన్నిటినీ బయటకి తీస్తోంది. తాజాగా ఐటీ అధికారులు చంద్రబాబు పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ నివాసం , కార్యాలయంపై దాడులు నిర్వహించారు.

 

పెద్ద ఎత్తున సొమ్ము తో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 96 గంటలుగా ఆయనను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. అసలు మీరు పీఎస్ గా ఎలా వచ్చారు ? మీరు ఏ ఏ వ్యవహారాలు చూస్తూ ఉండేవారు ? చంద్రబాబుకు మీకు ఉన్న వ్యక్తిగత సంబంధాలు ఏంటి ? గత ఐదేళ్లలో ఏఏ ప్రాంతాల్లో ఆస్తులు కొన్నారు ? ఎలా కొన్నారు ? తదితర విషయాలపై దృష్టి సారించి కీలకమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.


 ఈ ఊహానించని పరిణామాలపై రెండు రోజులుగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకుల్లో ఆందోళన పెరుగుతోంది. శ్రీనివాస్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఐటి అధికారులు టిడిపి పెద్ద తలకాయలు పై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 150 కోట్ల డీల్ కు సంబంధించి పూర్తిస్థాయిలో లభించడంతో చంద్రబాబులో ఆందోళనను పెంచుతున్నట్టు గా కనిపిస్తోంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా టిడిపి డబ్బు పంపిణీ చేసినట్లు కూడా ఆధారాలు అధికారులు విచారణలో దొరికినట్లుగా తెలుస్తోంది. అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనులు చేపట్టిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీ సబ్ కాంట్రాక్టు దక్కించుకున్న పనులు చేపట్టకుండా పూర్తి చేసి దొంగ ఇన్వాయిస్ లతో  బ్యాంకుల నుంచి సొమ్ములు విత్ డ్రా చేసినట్లు, దానిని మనీలాండరింగ్ ద్వారా తరలించినట్లు తెలుస్తోంది. 


ఈ విధంగా బ్యాంకు నుంచి డ్రా చేసి సొమ్ములు ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించారు అనే విషయం పైన బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా వివరాలు నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే త్వరలోనే దీనికి బాధ్యుడిగా చేసి చంద్రబాబు పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: