ఈ మ‌ధ్య సెక్స్ దందాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. అంద‌రితో క‌లిసి ఫ్యామిలీల మ‌ధ్య‌నే ఉంటారు. ముందు ఎవ‌రో ఒక‌రిద్ద‌రితో ఇల్లు తీసుకుంటారు. ఎవ్వ‌రికీ అనుమానం రాకుండా చుట్టుప్ర‌క్క‌ల వారితో చక్క‌గా మెదులుతారు. ఆ త‌ర్వాతే అస‌లు గుట్టు ర‌ట్ట‌వుద్ది. గుట్టుచ‌ప్పుడు కాకుండా అంద‌రిక‌ళ్ళూ గ‌ప్పి ఇలాంటి ప‌నులు చేయ‌డానికి ఏమాంత్రం వెన‌కాడ‌కుండా చేస్తుంటారు కొంద‌రు. కానీ అస‌లు విష‌యం బ‌య‌ట‌కు పొక్కాకే మొహంఎక్క‌డ పెట్టుకోవాలో కూడా అర్ధం కాదు. ఇక అలాగే పిల్ల‌లు ఈ మ‌ధ్య బాగా విచ్చ‌ల‌విడిగా తిర‌గ‌డం పార్టీల‌కు జల్సాల‌కు బాగా అల‌వాటు ప‌డి ఇంట్లో పెద్ద‌వాళ్ళు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయే స‌రికి ఎలాగైనా ఈజీగా డ‌బ్బులు సంపాదించే మార్గంగా ఈ సెక్స్ దందాల‌ను ఎంచుకుంటున్నారు. తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో విచ్చ‌ల‌విడిత‌నానికి అల‌వాటు ప‌డి చివ‌రికి వ్య‌భిచార ఊభిలోకి దిగ‌డానికి కూడా వెన‌కాడ‌డం లేదు నేటి యువ‌త‌. మ‌రి ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జార్ఖండ్ న‌గ‌రంలో చోటుచేసుకుంది.

 

వివ‌రాల్లోకి వెళితే... జార్ఖండ్‌లోని హజారిబాగ్ జిల్లాలోని సదర్ పోలీస్ లు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు చేధించారు. శుభం అనే అపార్టుమెంటులో ఈ వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా  కొనసాగుతోంది. ఇటీవల ఆ ఫ్లాట్‌కు యువకుల తాకిడి ఎక్కువ‌వ‌డంతో ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు శనివారం ఫ్లాట్‌లో రైడ్ చేసి, ఓ సెక్స్‌వర్కర్‌తో పాటు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.


నిందితుల‌ను విచారిస్తుండ‌గా పోలీసులు విన్న కొన్ని నిజాల‌కు ఒక్క‌సారిగా వారు విస్తుపోయారు.  ఈ ఫ్లాట్ యజమాని కొందరు స్టూడెంట్స్‌కు దాన్ని అద్దెకిచ్చినట్లు చెబుతున్నాడు. ఆ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న యువకులే సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డ్డారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. పాకెట్ మనీ కోసం కొందరు కాలేజీ అమ్మాయిలు కూడా తరుచూ అక్కడికి వచ్చిన క‌స్ట‌మ‌ర్ల‌ను సుఖ‌పెట్టి వారికి కావ‌ల‌సిన డ‌బ్బును తీసుకువెళుతునట్టు స‌మాచారం ఇచ్చారు.  నిందితులను కస్టడీలోకి తీసుకున్న త‌ర్వాత ఆ యువకుడి ఫ్లాట్ నుంచి కండోమ్ ప్యాకెట్లు, సిగరెట్, గుట్కా ప్కాకెట్లు భారీగా స్వాధీనం చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: