గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు హవా అడ్డు అదుపు లేకుండా సాగింది. ప్రభుత్వంలో అన్నీ తనే వ్యవహరిస్తూ వచ్చారనే ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. చంద్రబాబు కూడా అదే స్థాయిలో వెంకటేశ్వరరావు నిర్ణయాలకు మద్దతు ఇస్తూ, ఆయన చెప్పిన విధంగానే పరిపాలన చేస్తూ వచ్చారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ముఖ్యంగా వైసీపీ ఎమ్యెల్యేలు 23 మందిని టీడీపీలోకి తీసుకెచ్చేలా వ్యవహారం నడిపించింది ఆయనే అన్నది అయన మీద ఉన్న ఆరోపణ. పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇటువంటి వ్యవహారాలు చక్కబెడుతున్నారు అంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీ  వైసిపి ఆందోళనలు చేసింది. 


ఆయన నిఘా విభాగం బాస్ గా ఉన్న సమయంలో ఆర్ టి ఇన్ ప్లేటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇజ్రాయిల్ కు చెందిన డిఫెన్స్ సంస్థతో అక్రమ లావాదేవీలు చేసినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. కంపెనీకి ప్రైమరీగా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్  సాయి కృష్ణ కు చెందిన కంపెనీ వ్యవహరించిందని, ఇది ఖచ్చితంగా ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో పాటుగా దేశ రహస్యాలను, వ్యవహారాలను విదేశీ కంపెనీలకు చెప్పడం ద్వారా దేశ భద్రతకు ఏbee  వెంకటేశ్వరరావు ముప్పు కలిగించారని ఆయనపై ప్రధాన ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.


ఇప్పుడు ఏ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారాన్ని చూసుకుంటే తన కుమారుడు సాయి చేతన కృష్ణ మీద ఉన్న అతి ప్రేమే కారణంగా కనిపిస్తోంది. కుమారుడికి మేలు చేయాలనే ఉద్దేశంతో తో ఈ విధంగా వ్యవహరించి అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోయినట్టుగా  కనిపిస్తోంది. పోలీసులు వినియోగించే కీలకమైన నిఘా పరికరాల కొనుగోలు చేసే ఒప్పందం కుదుర్చుకోవడం, అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడం వంటివి తీవ్ర నేరంగా ప్రభుత్వం చెబుతోంది. కుమారుడికి ఆర్థిక లాభం చేకూర్చాలని ఒకే ఒక్క ఉద్దేశంతోనే  కంపెనీకి కీలకమైన రహస్యాలను ఆయన వెల్లడించినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.కుమారుడు కంపెనీకి సహాయం చేసేందుకు ఆయన కాంట్రాక్టు నిబంధనలు మీరి మరీ వ్యవహరించినట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 


పరికరాలను సరఫరా చేసేందుకు ఎక్స్ ప్రెషన్ ఇంటరెస్టును ఆహ్వానించలేదని, పరికరాల టెక్నికల్ పనికొస్తాయా లేదా ? అని నిర్ధారించే నియమాలను కూడా రూపొందించలేదని, ముఖ్యంగా ఇలాంటి పరికరాలు తెప్పించుకునేందుకు అవసరమయిన లైసెన్సులను కేంద్ర హోం శాఖ, పౌర విమాన శాఖ, రక్షణ శాఖ, టెలికామ్ నుంచి పొందనే లేదని కూడా ప్రభుత్వం సాక్ష్యంగా చూపిస్తోంది. ఈ వ్యవహారంలో ఆయన పీకల్లోతుల్లో మునిగిపోయినట్టుగానే అర్ధం అవుతోంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: