రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దమ్మున్న మీడియాగా పేరు తెచ్చుకున్న ఓ తెలుగు మీడియా విప‌రీత‌మైన పోదుపు చ‌ర్య‌లు తీసుకుంటోందా?  ప్ర‌తి రూపాయినీ.. ఆచి తూచి ఖ‌ర్చు చేస్తోందా?  ఉద్యోగుల నుంచి ఇత‌ర ఖ‌ర్చుల వ‌ర‌కు కూడా అన్నింటిలోనూ కోత పెడుతోందా?  అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న మేధావి వ‌ర్గం ఔన‌నే అంటోంది. ఓ పార్టీకి, సామాజిక వ‌ర్గానికి కొమ్ము కాస్తోంద‌నే ప్ర‌చారం పొందిన ద‌మ్మున్న మీడియాలో ఇప్పుడు పొదుపు చ‌ర్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్నాయి. ఈ పొదుపు చ‌ర్య‌ల‌తో ఉద్యోగులు కూడా ల‌బోదిబో మ‌నే ప‌రిస్థితి త‌లెత్తింద‌ని అంటున్నారు.

 

విష‌యంలోకి వెళ్తే.. ఏపీ, తెలంగాణ‌ల్లో రాజ‌కీయ వ్యూహంతో న‌డుస్తున్న ప‌త్రిక ఏదైనా ఉంటే.. అది ద‌మ్మున్న మీడియానే అనాలి. వ్య‌వ‌స్థీకృతంగా ఏ మీడియా అయినా.. త‌న‌కంటూ.. ఓ లైన్‌ను పెట్టుకుని దాని ప్ర‌కారం ముందుకు సాగుతుంది. ఈ క్ర‌మంలో ఆర్థికంగా కూడా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటుంది. కానీ, ద‌మ్మున్న మీడియాగా చెప్పుకొనే ఈ తెలుగు మీడియా మాత్రం పార్టీల‌ను ప‌ట్టుకుని నాయ‌కుల లైన్‌ను అనుస‌రించి ముందుకు సాగుతుంది. దీంతో తెలంగాణ‌లోను, ఏపీలోనూ కూడా ఓ పార్టీకి మాత్ర‌మే స‌పోర్టు చేయ‌డం, మిగిలిన పార్టీల వారిని అవ‌కాశ వాదంగా వినియోగించుకోవ‌డం తెలిసిందే.

 

దీంతో తెలంగాణ‌లో రెండు సార్లు ఒకే పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఈ ప‌త్రిక ఇబ్బందుల్లో ప‌డింది. ఇక‌, ఏపీలోనూ తాము మ‌ద్ద‌తిచ్చే మ‌నిషి అధికారంలోకి రాక‌పోవ‌డం, తాము పూర్తిగా వ్య‌తిరేకించే నాయ‌కుడు అదికారం చేప‌ట్ట‌డం ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే ప్ర‌క‌ట‌నలు సైతం ఆగిపోవ‌డంతో ఇప్పుడు ఎక్క‌డిక‌క్క‌డ క‌టింగులు పెడుతున్న‌ట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఏ మీడియా అయినా కొత్త సంవ‌త్స‌రం వ‌స్తోందం టే.. ఉద్యోగుల‌కు క్యాలెండ‌ర్లు, డైరీలు ఇవ్వ‌డం ప‌రిపాటి. ఈ మీడియా కూడా గ‌డిచిన ఇన్నేళ్ల‌లో ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా డైరీలు, క్యాలెండ‌ర్లు ఇచ్చింది. కానీ, ఈ ఏడాది వాటికి ఫుల్ స్టాప్ పెట్టింది.

 

అదే స‌మయంలో కార్యాల‌యాల్లో ఖ‌ర్చును సైతం భారీ ఎత్తున త‌గ్గించుకుంద‌ని స‌మాచారం. చివ‌ర‌కు అన్ని ఆఫీసుల్లో క‌రెంటు బిల్లులు ఎక్కువ వ‌స్తున్నాయి.. ఏసీలు ఆపేసి.. ఫ్యాన్లు వేసుకుని ప‌ని చేయాల‌ని కూడా పైనుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు ఉద్యోగ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.  అయితే, రాబ‌డి లేక‌నే ఇవ‌న్నీ జ‌రుగుతున్నాయ‌ని పైకి చెబుతున్నా.. వ‌చ్చిన ఆదాయాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మార్చుతున్న సంస్థ‌.. రూపాయిని కూడా బ‌య‌ట‌కు తీయ‌క‌పోవ‌డంతోనే త‌మ‌కు కోత‌లు పెడుతోంద‌ని ఉద్యోగులు అంటున్నారు. ఏదేమైనా.. ద‌మ్మున్న ప‌త్రిక చ‌ర్య‌లు మీడియా వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: